Itlu Maredumilli Prajaneekam: ఒకరోజు ముందే థియేటర్లలో వచ్చేస్తున్న మారుడమిల్లి ప్రజానీకం ట్రైలర్..!
టాలీవుడ్‌లో కామెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చి, తనదైన గుర్తింపును తెచ్చుకున్న హీరో అల్లరి నరేశ్. ప్రస్తుతం ఆయన కామెడీ జోనర్ కాకుండా, ఇతర వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్లో మళ్లీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకుంటున్నాడు. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న సినిమాలో అల్లరి నరేశ్ మరోసారి సీరియస్ పాత్రలో నటిస్తున్నాడు.
- Anil Aaleti
- Published On : November 10, 2022 / 12:31 PM IST
Itlu Maredumilli Prajaneekam Trailer To Be Exclusively Released In Theatres
Itlu Maredumilli Prajaneekam: టాలీవుడ్‌లో కామెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చి, తనదైన గుర్తింపును తెచ్చుకున్న హీరో అల్లరి నరేశ్. ఆయన నటించిన కామెడీ సినిమాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అయితే సమయం గడుస్తున్న కొద్దీ, నరేశ్ చేసిన రొటీన్ కామెడీ ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో, ఆయన కెరీర్ గ్రాఫ్ కిందకు పడిపోయింది. ప్రస్తుతం ఆయన కామెడీ జోనర్ కాకుండా, ఇతర వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్లో మళ్లీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకుంటున్నాడు.
Itlu Maredumilli Prajaneekam: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ముగించేశారు!
ఇప్పటికే ‘నాంది’ వంటి సీరియస్ సబ్జెక్ట్ కథతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన అల్లరి నరేశ్, ఇప్పుడు మరోసారి అలాంటి స్ట్రాటెజీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న సినిమాలో అల్లరి నరేశ్ మరోసారి సీరియస్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. కాగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్‌ను వైవిధ్యంగా ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.
Allari Naresh: ‘మారేడుమిల్లి ప్రజానీకం’ వచ్చేది అప్పుడే..!
తొలుత ఈ చిత్ర ట్రైలర్‌ను నవంబర్ 11న కేవలం థియేటర్లలో ఎక్స్‌క్లూజివ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఆ తరువాత డిజిటల్ రిలీజ్‌ను నవంబర్ 12న చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను దర్శకుడు ఏఆర్ మోహన్ డైరెక్ట్ చేస్తుండగా, జీ స్టూడియోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను నవంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
Witness #ItluMaredumilliPrajaneekam Theatrical Trailer Exclusively in Theatres from Nov 11th! ?
DIGITAL RELEASE ON NOV 12th ✅#IMP #IMPonNov25th ?@allarinaresh @anandhiactress @dir_armohan @ZeeStudios_ @HasyaMovies @RajeshDanda_ @lemonsprasad @_balajigutta @vennelakishore pic.twitter.com/scghCXAACL
— Allari Naresh (@allarinaresh) November 10, 2022
