Allari Naresh: ‘మారేడుమిల్లి ప్రజానీకం’ వచ్చేది అప్పుడే..!

టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ ఇటీవల చాలా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఆయన నటించిన ‘నాంది’ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.

Allari Naresh: ‘మారేడుమిల్లి ప్రజానీకం’ వచ్చేది అప్పుడే..!

Allari Naresh Maredumilli Prajaaneekam Release Pushed Back

Allari Naresh: టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ ఇటీవల చాలా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఆయన నటించిన ‘నాంది’ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను సీరియస్ సబ్జెక్టుగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో అల్లరి నరేశ్ యాక్టింగ్ మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Allari Naresh : ఓట్ల కోసం నరేష్ ప్రయాణం.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ రిలీజ్..

ఇక ఈ సినిమాను నవంబర్ 11న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడంతో, ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాను నవంబర్ 11న కాకుండా నవంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. అయితే ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయడానికి గల కారణాన్ని మాత్రం చిత్ర యూనిట్ తెలియజేయలేదు.

Allari Naresh: మారేడుమిల్లిలో టీచర్ జాబ్ కొట్టేసిన అల్లరి నరేశ్

ఏదేమైనా అల్లరి నరేశ్ నటిస్తున్న ఇట్లు ‘మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ ఈసారైనా ఫిక్స్ చేసిన డేట్‌కు వస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు ఏఆర్.మోహన్ తెరకెక్కిస్తుండగా, జాంబిరెడ్డి ఫేం ఆనంది ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. జీ5, హాస్య మూవీస్ ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.