రాజమండ్రి నుండి రాంపూర్ వరకు జయప్రద ప్రస్థానం..

Jayaprada: జయప్రద.. ఒకప్పటి స్టార్ కథానాయిక.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి అగ్రకథాయకులతో ఆడిపాడారు.. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ నటించారామె.. వయసు ఆరు పదులకు చేరువవుతున్నా అణువంతైనా అందం తగ్గకపోవడం ఆమెకి దేవుడిచ్చిన వరం..
లలితకుమారిగా రాజమండ్రిలో పుట్టిన జయప్రద ప్రస్థానం రాంపూర్ వరకు ఎలా కొనసాగింది.. కొంత కాలం విరామం తర్వాత తెలుగులో నటిస్తున్న జయప్రద 10 టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు..
‘‘సినిమా సెట్‌లో డైరెక్టరే బాస్.. వయసుకు,ప్రేమకు నెంబర్ లేదు.. మొదటిసారి రాజేంద్రప్రసాద్‌తో నటిస్తున్నా.. పంజాబీతో కలిపి మొత్తం 8 భాషల్లో నటించా.. నా తొలి పంజాబీ చిత్రం ఏప్రిల్ 2న విడుదలవుతుంది.. డాక్టర్ అవ్వాలనుకుని… యాక్టరయ్యాను.. ఇప్పుడు నేను డాక్టర్ జయప్రద
లలితారాణి.. జయప్రదగా మారడం వెనుక ఎందరివో ఆశీస్సులున్నాయి..
నడకరాని నాకు సినిమానే నడక నేర్పింది..
డ్యాన్స్ నా జీవితంలో భాగంగా మారిపోయింది..
శ్రీదేవితో నా కాంబినేషన్ రియల్ సిస్టర్స్‌లా ఉండేది..
శ్రీదేవి మరణంతో ఒంటరయ్యాను..
గతంలో అనుభవించిన కష్టాల గురించి ఇప్పుడాలోచించను..
కష్టాల్లో నా కుటుంబం, సినీ పరిశ్రమ అండగా ఉంది
హీరో కృష్ణ నాకు సపోర్టుగా నిలిచారు..
మళ్లీ నా సినిమా ప్రపంచానికి వచ్చేశాను.. చాలా హ్యాపీగా ఉంది’’..
‘‘సాగర సంగమం సినిమాను రీమేక్ చేస్తే నటిస్తా..
మళ్లీ జన్మంటూ ఉంటే జయప్రదగానే పుడతా..
రామానాయుడు నన్ను కూతురులా చూసుకున్నారు..
సినిమా ఇండస్ట్రీలో శోభన్ బాబే అందగాడు..
సినిమాల్లో పుట్టాను.. సినిమాల్లోనే పెరిగాను..
చివరి శ్వాస వరకు సినిమాలతోనే ఉంటాను..
నన్ను చాలా మంది స్వార్ధానికి వాడుకున్నారు..
మాట్లాడుతూనే జయప్రదను అమ్మేసేవాళ్లు..
సన్నిహితులే డబ్బుకోసం మోసం చేశారు’’..
‘‘ఆర్టిస్టుగా బిజీగా ఉండే సమయంలోనే రాజకీయాల్లో వచ్చా.. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చా..
ఎన్టీఆర్‌పై ప్రేమ, గౌరవంతోనే టీడీపీలో చేరా..
ఆంధ్రా బిడ్డగా ఇక్కడి ప్రజలకే సేవ చేయాలనుకున్నా.. అనూహ్యంగా యూపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాను..
ఏపీ నుంచి యూపీ రాజకీయాల్లోకి వెళ్లడం కలగా జరిగిపోయింది.. యూపీ ప్రజలు అభినేత్రిని నాయకగా మార్చారు..
అధికారంలో లేనప్పుడు, ఉన్నప్పుడు టీడీపీ నేతల తీరులో మార్పు ఉండేది..
పెద్ద పదవుల్లో కూర్చున్న తర్వాత ఆర్టిస్టులను మర్చిపోయారు..
చంద్రబాబు నా సేవలను గుర్తించలేదు..
ఎన్టీఆర్ సంక్షోభ సమయంలో చంద్రబాబుకు మద్దతిచ్చి తప్పుచేశా..
నన్ను రాజ్యసభకు పంపింది చంద్రబాబే..
చంద్రబాబు గుర్తించలేదు కాబట్టే యూపీకి వెళ్లిపోయా..
చంద్రబాబుకు నేనేంటో చూపించేందుకే యూపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టా..
నా రాష్ట్రాన్ని, నా ప్రజలను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చారు..
నాకు రాజకీయాల్లో అమర్‌సింగ్ పునర్జన్మనిచ్చారు..
అమర్‌సింగ్ కష్టాల్లో ఉన్నప్పుడు అమితాబ్, అనీల్ అంబానీ పట్టించుకోలేదు..
అమితాబ్, అనిల్ అంబానీ అవకాశవాదంగా వ్యవహరించారు..
అమర్‌సింగ్ లేని వెలితి నాకు ఎప్పుడూ ఉంటుంది..
బీజేపీలోకి నాకు సాదర స్వాగతం లభించింది..
ఏపీ రాజకీయాల్లోకి రావాలని ఉన్నా..నిర్ణయం పార్టీ నాయకత్వానిదే..
పార్టీ కోరితే ఏపీలో బీజేపీ తరపున ప్రచారం చేస్తా..
కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావడం ఆశ్చర్యపరిచింది..
నన్ను రాజకీయాల్లోకి రావొద్దన్న కమల్ ఇప్పుడు పాలిటిక్స్‌లో ఉన్నారు..
తెలుగు రాజకీయాల్లో ఉండడానికే ఇష్టపడతాను..
రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు నేను వ్యతిరేకం..
టీడీపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నాను..
చంద్రబాబు నన్ను ఎప్పుడో మర్చిపోయారు’’..