MAA Elections: నరేష్ ప్రెస్‌మీట్‌లో జీవితా మిస్సింగ్.. కారణం ఇదేనట!
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల రగడ ఇప్పుడు ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఎన్నికల కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమా పోటీచేయనున్నట్లుగా ప్రకటించారు. ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టి తన ప్యానల్ సభ్యులను పరిచయం చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు, నాగబాబు చేసిన కామెంట్స్ ఎన్నికల వేడిని పెంచాయి.

Maa Elections
MAA Elections: టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల రగడ ఇప్పుడు ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఎన్నికల కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమా పోటీచేయనున్నట్లుగా ప్రకటించారు. ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టి తన ప్యానల్ సభ్యులను పరిచయం చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు, నాగబాబు చేసిన కామెంట్స్ ఎన్నికల వేడిని పెంచాయి. ఈ వ్యాఖ్యలను ఖండించేందుకు ప్రసుత మా అధ్యక్షుడు, నటుడు నరేష్ శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ‘మా’ కోసం మేం చాలా చేశాం.. నిందలు వద్దంటూ హితవు పలికారు.
అయితే.. నరేష్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి జీవిత రాజశేఖర్ హాజరు కావాల్సి ఉంది. ఈమేరకు ఆమె మా సభ్యుల గ్రూప్స్ లో కూడా సమాచారమిచ్చారు. కానీ, అనూహ్యంగా మీడియా సమావేశానికి దూరమయ్యారు. ఇక మీడియా సమావేశం కూడా ముందుగా ఫిలిం ఛాంబర్ లో అనుకోగా చివరికి సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లోనే ఈ ప్రెస్ మీట్ నిర్వహించారు. దీంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా, ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జీవితా ఈ ఊహాగానాలకు సమాధానం ఇచ్చారు.
మీడియా సమావేశానికి హాజరుకావద్దని నరేష్ గారే చెప్పారని జీవితా చెప్పారు. జీవిత మా సభ్యుల గ్రూప్ లో సమాచారమివ్వడంతో చాలామంది ఈ సమావేశానికి సిద్ధమయ్యారని.. అలా అందరూ మీడియా ముందు వారికి తోచింది మాట్లాడితే ఇది మరికాస్త వివాదాస్పదం అవుతుందనే వద్దన్నారని చెప్పారు. ఫిలిం ఛాంబర్ లో మీట్ కూడా అందుకే క్యాన్సిల్ చేసి కొద్దిమందితో కృష్ణ గారి ఇంట్లో నిర్వహించారని చెప్పారు. అంతేకాదు ప్యానల్ తరపున కాకుండా అధ్యక్షా పదవికి మాత్రమే సొంతంగా కాంటెస్ట్ చేయనున్నట్లు పోటీ విషయంలో కూడా జీవితా క్లారిటీ ఇచ్చారు.