Jignesh Mevani: నేను ముఖ్యమంత్రి పదవి రేసులో లేను: జిగ్నేశ్ మేవానీ
గుజరాత్‌లో ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని ఆ రాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేశ్ మేవానీ స్పష్టం చేశారు. అలాగే, గుజరాత్‌లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయంపై కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటన చేయదని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
- T Venkateshwarlu
- Published On : May 29, 2022 / 02:19 PM IST
Mevani
Jignesh Mevani: గుజరాత్‌లో ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని ఆ రాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేశ్ మేవానీ స్పష్టం చేశారు. అలాగే, గుజరాత్‌లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయంపై కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటన చేయదని తాను భావిస్తున్నట్లు మేవానీ చెప్పారు. ఆయన కాంగ్రెస్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నప్పటికీ ఆ పార్టీలో చేరలేదు. ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు.
pani puri: పానీ పూరీ తిని 97 మంది పిల్లలకు అస్వస్థత
కొన్ని నెలల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిగ్నేశ్ మేవానీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ, వారి మధ్య నుంచి పుట్టుకొచ్చిన నేతకు ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అన్నారు. గుజరాత్‌లో కాంగ్రెస్ గెలుపొందితే అటువంటి నేతనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేయాలని ఆయన చెప్పారు.
UN human rights: ఐరాస మానవ హక్కుల బృందం చైనాలో స్వేచ్ఛగా పర్యటించలేదు: అమెరికా
పటీదార్ నేత హార్దిక్ పటేల్ రాజీనామా ప్రభావం కాంగ్రెస్ పార్టీపై పడబోదని ఆయన అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదేలు అవుతుండడం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగ రేటు పెరిగిపోతుండడం, మతప్రాతిపదికన తమను విడగొడుతుండడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆయన చెప్పారు. కరోనా సమయంలోనూ గుజరాత్‌లో ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదని ఆయన అన్నారు.
