pani puri: పానీ పూరీ తిని 97 మంది పిల్ల‌ల‌కు అస్వస్థత

పానీ పూరీ అంటే చిన్నారులు ఎంతగానో ఇష్టపడతారు. మార్కెట్, షాపింగ్ మాళ్లకు వెళ్తే చాలు వారికి పానీ పూరీ తినిపించాల్సిందే. అయితే, పలు ప్రాంతాల్లో పానీ పూరీ తయారు చేసేవారు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చిన్నారుల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు.

pani puri: పానీ పూరీ తిని 97 మంది పిల్ల‌ల‌కు అస్వస్థత

Panipuri

pani puri: పానీ పూరీ అంటే చిన్నారులు ఎంతగానో ఇష్టపడతారు. మార్కెట్, షాపింగ్ మాళ్లకు వెళ్తే చాలు వారికి పానీ పూరీ తినిపించాల్సిందే. అయితే, పలు ప్రాంతాల్లో పానీ పూరీ తయారు చేసేవారు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చిన్నారుల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. కలుషిత నీరు, పదార్థాలతో కొందరు పానీ పూరీ తయారు చేస్తుండడంతో అవి తిన్న వారు ఆసుపత్రులపాలు అవుతోన్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా, మధ్యప్రదేశ్‌లో ఇటువంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది.

Drone: భార‌త్‌-పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల వ‌ద్ద డ్రోన్ క‌ల‌కలం

ఆ రాష్ట్రంలోని మండ్లా జిల్లాలో గిరిజ‌నులు అధికంగా ఉండే సింగ‌ర్పూర్‌లో శ‌నివారం రాత్రి జ‌రిగిన జాత‌ర‌లో ఒకే షాపులో పానీ పూరీ తిన్న 97 మంది చిన్నారులు అనంత‌రం అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఫుడ్ పాయిజ‌నింగ్‌తో వారు బాధ‌ప‌డ్డార‌ని, వారిని జిల్లా ఆసుప‌త్రిలో చేర్పించామ‌ని ఆదివారం మ‌ధ్య‌ప్ర‌దేశ్ వైద్య శాఖ‌ అధికారులు మీడియాకు తెలిపారు.

PM Modi: 8 ఏళ్ల పాల‌న‌పై 31న అన్ని రాష్ట్రాల సీఎంల‌తో మోదీ భేటీ: జైరాం ఠాకూర్

ఆ పిల్ల‌లంద‌రూ వాంతులు, క‌డుపునొప్పితో బాధ‌ప‌డ్డార‌ని వివ‌రించారు. వారందరికీ వైద్యులు చికిత్స అందించార‌ని, బాధిత పిల్ల‌లు కోలుకుంటున్నార‌ని తెలిపారు. పానీ పూరీ అమ్మిన వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నామ‌ని పోలీసులు చెప్పారు. అలాగే, సంబంధిత అధికారులు పానీ పూరీ శాంపిళ్ల‌ను సేక‌రించి, వాటిని ప‌రీక్షించేందుకు పంపార‌ని వివ‌రించారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోన్న పిల్ల‌ల‌ను ప‌లువురు మంత్రులు ప‌రామ‌ర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని ఆసుప‌త్రి వైద్యుల‌కు సూచించారు.