RRR: జర్నీ ఆఫ్ ఆర్ఆర్ఆర్!

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ పేరు మాత్రమే వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఈ భారీ పాన్ ఇండియా మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి.....

RRR

RRR: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ పేరు మాత్రమే వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఈ భారీ పాన్ ఇండియా మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి రెడీ అయ్యాడు. ‘బాహుబలి’ సిరీస్ తరువాత జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా కావడం, టాలీవుడ్‌లోని ఇద్దరు మేటి స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో RRR ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీగా అదిరిపోయే క్రేజ్‌ను దక్కించుకుంది. మరో రెండు రోజుల్లో యావత్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన జర్నీ గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

టాలీవుడ్‌లో ఫెయిల్యూర్ లేని దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి, బాహుబలి సిరీస్‌తో అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక బాహుబలి సిరీస్ తరువాత ఆయన నుండి మరో ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందా.. ఎవరితో జక్కన్న తన నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో.. ఎవరి ఊహలకు అందని విధంగా 2017 నవంబర్ 18న తారక్, చరణ్‌లతో కలిసి ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారి తీశాడు. ఇక ఈ ఇద్దరు హీరోలతో జక్కన్న చేతులు కలపడంతో ఈ సినిమా గురించి యావత్ టాలీవుడ్‌లో తీవ్ర చర్చ సాగింది. జక్కన్న ఈసారి ఎలాంటి కథతో వస్తున్నాడా అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు.

RRR: ఫుల్ స్వింగ్‌లో ప్రమోషన్స్.. నార్త్‌లో ఆసక్తిలేని ప్రీ రిలీజ్ బుకింగ్స్!

అయితే 2018 నవంబర్ 11న ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ చేసిన జక్కన్న, నవంబర్ 19న ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించారు. RRR అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమాకు.. RRR అర్థం వచ్చేలా ఓ టైటిల్‌ను పెట్టాలని 2019 మార్చి 18న ప్రేక్షకులను నేరుగా అడిగారు జక్కన్న అండ్ టీమ్. కాగా ఈ సినిమాకు చివరగా ‘‘రౌద్రం రణం రుధిరం’’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు మార్చి 25న అనౌన్స్ చేశారు. జక్కన్న బాహుబలి చిత్రాన్ని ఐదేళ్ల పాటు తెరకెక్కించడంతో ఆర్ఆర్ఆర్ కూడా అంతే సమయం తీసుకుంటుందా అని అభిమానులు ఆందోళన చెందారు. కానీ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామంటూ జక్కన్న ఒకటికి రెండు సార్లు చెబుతూ వచ్చాడు.

కట్ చేస్తే.. 2018లో మొదలైన ఆర్ఆర్ఆర్ 2022లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ సినిమా ఆలస్యానికి కారణం ఒకటని చెప్పలేం. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించాలని చూసిన ఈ సినిమాకు ఏకంగా రూ.500 కోట్ల మేర బడ్జెట్ కేటాయించాల్సి వచ్చింది. ఈ సినిమాను మొదలుపెట్టినప్పుడు రెండేళ్లలో పూర్తి చేసి 2020 జూలై 30న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా ఈ సినిమాను 2021 జనవరి 8కి వాయిదా వేశారు. అయితే కోవిడ్‌తో యావత్ దేశం అల్లాడుతుండటంతో ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాలేకపోయింది.

RRR: తారక్ వాడిన బుల్లెట్‌కు అంత ఖర్చా..?

అప్పటికే రెండుసార్లు వాయిదా వేసిన చిత్రం కాబట్టి ఈసారి ఎలాగైనా రిలీజ్ డేట్ విషయంలో పక్కాగా ఉండాలని 2021 అక్టోబర్ 13న రిలీజ్ చేయాలని చూశారు. కానీ కరోనా సెకండ్ వేవ్ మరోసారి ఆర్ఆర్ఆర్‌ను దెబ్బకొట్టింది. దీంతో ఈ సినిమా రిలీజ్ మళ్లీ మొదటికొచ్చింది. అయినా ఏమాత్రం నిరాశ పడకుండా ఈ సినిమాను 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని జక్కన్న అండ్ టీమ్ గట్టిగానే ప్రయత్నించారు. కానీ థర్డ్ వేవ్ ఈసారి వారి ఆశలపై నీళ్లు చల్లింది.

ఇక కరోనా ప్రభావం తగ్గడంతో ఈ సినిమాను మార్చి 18 లేదా ఏప్రిల్ 28లలో ఏదో ఒక తేదీన రిలీజ్ చేయాలని భావించిన చిత్ర యూనిట్, ఫైనల్‌గా 2022 మార్చి 25న RRR చిత్ర రిలీజ్‌కు రెడీ అయ్యింది. అసలే భారీ బడ్జెట్ చిత్రం, భారీ క్యాస్టింగ్‌తో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో చిత్ర యూనిట్ ముందే ఊహించింది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న టికెట్ రేట్లు, అక్యుపెన్సీ లాంటి అన్ని సమస్యలను అధిగమించి.. ఎట్టకేలకు ప్రేక్షకులు కోరే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇచ్చేందుకు రెడీ అయ్యింది. మరి ఇంతటి క్రేజ్ ఉన్న సినిమా గనకే ఈ చిత్రం రిలీజ్‌కు ముందే వెయ్యి కోట్ల మేర బిజినెస్ చేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ వస్తే తొలి వారంలోనే ఈ సినిమా రూ.3 వేల కోట్లు కొల్లగొడుతుందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఈ లెక్కన ఆర్ఆర్ఆర్ ఇండియన్ సినిమా చరిత్రలో ఓ సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం ఖాయం!