ఖైరతాబాద్ వినాయకుడు ఒక్క అడుగే

తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి అనగానే గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం. వినాయకచవితికి చాలా రోజుల సమయం ఉండగా ఖైరతాబాద్ గణేషుడి భారీ విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభించడం ఆనవాయితీ.
ప్రపంచంలోని అన్ని దేశాలను హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు అనేక మార్పులు చోటుచేసుకుంటున్న క్రమంలోనే వినాయక విగ్రహ ఏర్పాటు విషయంలో కూడా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులను ప్రారంభించేందుకు మే 18న కర్ర పూజ నిర్వహించేందుకు కమిటీ నిర్ణయం తీసుకుంది.
విగ్రహ తయారీ ప్రారంభంలో తొలి ఘట్టమైన కర్రపూజను మే 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు చేపడుతున్నట్లు గణేష్ ఉత్సవ్ కమిటీ వెల్లడించింది. కర్రపూజలో పాల్గొనే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది.
ఖైరతాబాద్ వినాయకుడు 2019లో ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా భక్తుల ముందుకొచ్చాడు. 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో.. 61 అడుగుల ఎత్తులో భారీ గణపతి ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది మాత్రం ఒక్క అడుగు వినాయకుడే భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఈ మేరకు కమిటీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.
Read More:
* Hyderabad వాసులకు గుడ్ న్యూస్..త్వరలో Metro పరుగులు!