Kerala : ఆరోగ్యశాఖ అధికారులు మీడియాతో మాట్లాడాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే

ఆరోగ్యశాఖ అధికారులు మీడియాతో మాట్లాడాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే నని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

medical officers to take permission before speaking to media : ఈ కరోనా కాలంలో..ముఖ్యంగా కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ భయం నెలకొన్న క్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు బహిరంగంగా మీడియాతో మాట్లాడాలంటే ప్రభుత్వం అనుమతి తప్పకుండా తీసుకోవాలని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆరోగ్యశాఖ అధికారులు, హెల్త్ వర్కర్స్ గానీ మీడియాతో మాట్లాడాలంటే ముందుగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ వీకే రాజు ఆదేశాలు జారీచేశారు. ఆరోగ్య శాఖ పనితీరు గానీ..ఇతర సంబంధిత విషయాలు గానీ మీడియాతో మాట్లాడాలంటే ఆరోగ్య శాఖ అధికారులు..ఆరోగ్య సిబ్బంది ఈ నిబంధన పాటించాలని..ఉత్తర్వులిచ్చారు.

Read more : MP : ఏదో కనిపించని శక్తి..నా బట్టలు,నగలు దొంగిలిస్తోంది..నా ఆహారం తినేస్తోంది : పోలీసులకు మహిళా ఇంజనీర్ ఫిర్యాదు
ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో సమాచారం అందించాల్సిన అవసరం వస్తే కచ్చితమైన వాస్తవాలను మాత్రమే వెల్లడించాలని..మాట్లాడేముందుకు మీడియాకు వెల్లడించే విషయాలపై ఒకటికి రెండు సార్లు ధృవీకరించుకుని మాట్లాడాలని స్పష్టంచేశారు. సమాచారం సరిగాలేనట్లయితే అది ప్రజలను తప్పుదోవ పట్టించేలా..ఆందోళన కలిగించేలా మారవచ్చని..ముఖ్యంగా ఈ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండి విషయాలను సుస్పష్టమైన వాస్తవాలను వెల్లడించయాలని..తెలిపారు. అలా కాకుంటే వ్యాధి వ్యాప్తిపై కలకలం సృష్టించినదవుతుందని..కాబట్టి ఆరోగ్య శాఖ అధికారులు కచ్చితమైన సమాచారాన్ని మాత్రమే వెల్లడించాలని స్పష్టంచేశారు.

Read more : Omicron : బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ లేదు

కాగా..గతంతో కొన్ని సందర్భాల్లో అధికారులు..మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టికి కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఎటువంటి అవాస్తవాలు బయటకు పోకూడదని వాటి వల్ల ప్రజల్లో ఆందోళన నెలకొంటుందని..కాబట్టి ఇటువంటి నిబంధన పెట్టినట్లుగా తెలుస్తోంది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు