MP : ఏదో కనిపించని శక్తి..నా బట్టలు,నగలు దొంగిలిస్తోంది..నా ఆహారం తినేస్తోంది : పోలీసులకు మహిళా ఇంజనీర్ ఫిర్యాదు

ఏదో కనిపించని శక్తి..నా బట్టలు,నగలు దొంగిలిస్తోంది..నా ఆహారం తినేస్తోంది దయచేసి నా సమస్య పరిష్కరించిండీ అంటూ ఓ మహిళా ఇంజనీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది విన్న పోలీసులు షాక్..

MP : ఏదో కనిపించని శక్తి..నా బట్టలు,నగలు దొంగిలిస్తోంది..నా ఆహారం తినేస్తోంది : పోలీసులకు మహిళా ఇంజనీర్ ఫిర్యాదు

Invisible Forces Stealing From Me Women Engineer Complaint

Invisible Forces Stealing From Me Women Engineer Complaint : ఏదో కనిపించని శక్తి..నా బట్టలు,నగలు దొంగిలిస్తోంది..నా ఆహారాన్ని తినేస్తోంది అంటూ మధ్యప్రదేశ్ లో ఓ మహిళా ఇంజనీర్ చేసిన ఫిర్యాదు విని పోలీసులు షాక్ అయ్యారు. ఇదేం ఫిర్యాదు? ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఏదో సాధారణ వ్యక్తులు ఇటువంటి ఫిర్యాదు చేస్తే కౌన్సెలింగ్ ఇచ్చి..సర్ధి చెప్పి పంపించేయొచ్చు…కానీ సదరు మహిళా ఇంజనీర్ ప్రధానమంత్రి రూరల్ రోడ్ మిషన్‌లో సబ్ ఇంజినీరుగా పనిచేసే వ్యక్తి..దీంతో పోలీసులు సైతం షాక్ అవుతున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు పూర్తిగా విన్న పోలీసులు ఆ మాటల నుంచి తేరుకోలేకపోతున్నారు.

Read more : IPS Bharati Arora : ‘కృష్ణుడికి సేవ చేసుకోవాలి’ అంటూ రిజైన్ చేసిన మహిళా ఐపీఎస్‌

మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లాకు చెందిన సదరు మహిళ ప్రధానమంత్రి రూరల్ రోడ్ మిషన్‌లో సబ్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. ఆమె ఇటీవల కొత్వాలి పోలీసు స్టేషన్ కు వచ్చి ఇచ్చి ఈ వింత ఫిర్యాదు విన్న పోలీసులు షాక్ అయ్యారు. ఈ ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఏదో కనిపించని శక్తి నా ఇంటిలో ఉందని..అది నా బట్టల్ని దొంగిలిస్తోందనీ..అలాగే నా నగలు కూడా కాజేస్తోందని వాపోయారావిడ. అంతేకాదు తన ఇంటిలో ఆహారాన్ని కూడా మాయం చేస్తోందని తన నగల బరువుని కూడా హరించివేస్తోందని ఈ సమస్యతో నాకు మనశ్శాంతి కరవైందని దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపించాలంటూ సదరు మహిళా ఇంజనీర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత నాలుగు ఐదు రోజులుగా ఇలా జరుగుతోందని..నా సమస్యను తీర్చాలంటూ వాపోయారు. ఆమె చేసిన వింత ఫిర్యాదు విన్న పోలీసు అధికారులు కూడా షాక్ అయ్యారు.

Read more : buffalo DNA : మా గేదెకు DNA టెస్ట్ చేయించండి సార్..ఎస్పీని వేడుకుుంటున్న రైతు
ఈ వింత ఫిర్యాదుపై పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ రత్నాకర్ హింగ్వే మాట్లాడుతూ..ఆమె ఫిర్యాదు విన్న తాము తేలిగ్గా తీసుకోకుండా ఆమె గురించి విచారించామని ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నారని తెలిసిందన్నారు. ఆమెది కేవలం అపోహ మాత్రమేనని ఎటువంటి అదృశ్య శక్తులు లేవని వివరించారు. కౌన్సెలింగ్ కోసం ఆమెను మానసిక వైద్య నిపుణుడి వద్దకు పంపుతామని తెలిపారు.