buffalo DNA : మా గేదెకు DNA టెస్ట్ చేయించండి సార్..ఎస్పీని వేడుకుుంటున్న రైతు

buffalo DNA : మా గేదెకు DNA టెస్ట్ చేయించండి సార్..ఎస్పీని వేడుకుుంటున్న రైతు

మా గేదెకు Dna టెస్ట్ చేయించండి సార్..

up man buffalo DNA test : మా గేదెకు DNA టెస్ట్ చేయించండి సార్..అంటూ ఓ రైతు జిల్లా ఎస్పీకి మొరపెట్టుకున్నాడు. మా గేదె దూడ కనిపించకుండాపోయింది. ఎవరో దొంగిలించారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేస్తే..బర్రెలు, గొర్రెలు తప్పిపోతే వెతికి పెట్టటానికి మాకేమీ పనీ పాటా లేదనుకున్నావా? అని తిడుతున్నారనీ వాపోయాడు. మా గేదె ఈ మధ్యనే ఈనింది. ఆ దూడ కనిపించట్లేదు. తల్లి మాత్రం మా ఇంట్లోనేఉంది. దూడ కోసం తల్లి ఒకటే అరుస్తోంది..బిడ్డ కోసం తల్లి పడే బాధ నేను చూడలేకున్నాను..దీంతో నా గేదెదూడను నేనే వెతుక్కున్నాను.దొరికింది. కానీ ఆ దూడకు గేదెకు DNA టెస్ట్ చేయించండీ సార్..అంటూ జిల్లా ఎస్పీకి లేఖ రాసాడో రైతు..

ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ ప్రాంతానికి చెందిన చంద్రపాల్ సింగ్ అనే తన రైతు తన గేదెదూడ దొంగిలించబడటంతో పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆరు నెలల క్రితం అతని గేదె తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘ గుడ్డు అనే పేరు గల నా గేదెదూడ కనిపించట్లేదు. ఎవరో దొంగిలించారు. దయచేసి నా దూడను వెతికించి.. తెచ్చిపెట్టండీ అంటూ ఆరు నెలల క్రితం చంద్రపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే `క్రైమ్ కంట్రోల్ ఫార్ములా` పరిధిలోకి ఆ ఫిర్యాదు రాదని భావించి పోలీసులు కేసు నమోదు చేయలేదు. పైగా గొర్రెలు..బర్రెలు కనిపించకుండాపోతే వాటిని వెతికి పెట్టటానికి మాకు పనీ పాటా లేదా? ఇదే పని అనుకున్నావా? అంటూ చంద్రపాల్ పై కాస్తంత విసుగు ప్రదర్శించారు. దీంతో చంద్రపాల్ స్వయంగా ఊరూరూ తిరిగి తన గేదెదూడను ఎట్టకేలకు పట్టుకోగలిగాడు.

ఆ తరువాత చంద్రపాల్ తన గేదెదూడ దొరికింది కదాని ఊరుకోలేదు. ఎస్పీకి లేఖ రాశాడు. `నా గేదెదూడ తప్పిపోయిందని నేను ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. నేను తప్పుడు ఫిర్యాదు చేశానని నా మీద ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో నేనే స్వయంగా నా గేదెను వెతికి పట్టుకున్నాను. దయచేసి ఆ గేదెకి డీఎన్ఏ టెస్ట్ చేయించండి. ఆ తల్లి గేదె మా ఇంట్లోనే ఉంది. రెండు గేదెలకూ డీఎన్ఏ టెస్ట్ చేయించి నా గేదెను నాకు అప్పగించండి‘ అంటూ ఆ ఎస్పీ సుకీర్తీ మాధవ్ కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఎస్పీకి లేఖ రాసిన రైతు..ఆ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.