Kgf Chapter 2 Salaar Movies Of Prashant Neel Gets Record Deal
Prashant Neel: కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయగా, కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో కూడా దుమ్ములేపింది. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా హీరో యశ్ పేరు మార్మోగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్ – చాప్టర్ 2’ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే తాజాగా ఈ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న రెండు సినిమాలకు ఓ భారీ ఢీల్ కుదరడంతో, ఇప్పుడు ఈ వార్త సౌత్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది.
Salaar: బాప్ రే.. సలార్ ఓటీటీ రైట్స్ కోసం రూ.200 కోట్ల ఆఫర్?
ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్ – చాప్టర్ 2’తో పాటు, ప్రభాస్ హీరోగా తెరెక్కుతున్న ‘సలార్’ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయి. ఈ రెండు భారీ పాన్ ఇండియా చిత్రాల ఓవర్సీస్ రేటు ఏకంగా రూ.100 కోట్లు పలికినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. సౌత్‌లో తెరకెక్కిన సినిమాలకు ఈ స్థాయిలో ఓవర్సీస్ రైట్స్ అమ్ముడుకావడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నది ఒకే డైరెక్టర్ కావడం.
KGF 2: ప్రమోషన్ల సీజన్.. యష్ కూడా మొదలు పెట్టేస్తున్నాడు!
కేజీఎఫ్ 2 చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. కాగా సలార్ చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో ప్రభాస్ మాస్ లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నాడు. ఇక ఈ చిత్రంలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ రెండు సినిమాలను హొంబాలే ఫిలింస్ ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.