Krithi Shetty To Pair Opposite Suriya In His Next Movie
Krithi Shetty: తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవల బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఆయన నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’, ‘జై భీమ్’ చిత్రాలు నేరుగా ఓటీటీల్లో రిలీజ్ అయినా, వాటికి ప్రేక్షకులు నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్ హిట్లుగా సూర్య కెరీర్‌లో నిలిచాయి. ఈ రెండు సినిమాల తరువాత సూర్య మళ్లీ తన స్పీడు పెంచాడు. ఇటీవల ఈటి(ET) అనే సినిమాతో ప్రేక్షకుల మందుకు వచ్చాడు ఈ హీరో. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. కాగా సూర్య తన కొత్త చిత్రాన్ని తాజాగా సోమవారం నాడు ప్రారంభించారు.
Krithi Shetty: సూర్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ..?
దర్శకుడు బాలా డైరెక్షన్‌లో సూర్య నెక్ట్స్ మూవీ ఉంటుందని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ సూర్య, దర్శకుడు బాలా కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ కాంబో అనగానే తమిళ ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కాగా వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ ఈ కాంబో ఎప్పుడెప్పుడు సెట్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తూ వచ్చారు. అయితే 18 ఏళ్ల తరువాత మళ్లీ ఈ కాంబో సెట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్‌గా యంగ్ సెన్సేషనల్ బ్యూటీ కృతి శెట్టి సెలెక్ట్ అయ్యింది.
ఇది నిజంగా కృతి శెట్టికి లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. తమిళ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంట్రీ ఇవ్వని ఈ బ్యూటీ, ఒకేసారి బాలా-సూర్య లాంటి క్రేజ్ ఉన్న కాంబోతో వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమాలో అమ్మడి పాత్ర ఎలా ఉంటుందా అనే ఆసక్తి అప్పుడే ఆమె అభిమానుల్లో నెలకొంది. కాగా ఈ సినిమాను కూడా బాలా తనదైన మార్క్ చిత్రంగా తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీలో సూర్య పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
Krithi Shetty: మూడు సినిమాలతోనే పాన్ ఇండియా స్టార్‌గా కృతి శెట్టి..?
కన్యాకుమారిలో ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాకు జివి.ప్రకాష్ సంగీతం అందిస్తుండగా, జ్యోతిక-సూర్యలు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏదేమైనా బాలా లాంటి స్టార్ డైరెక్టర్‌తో సూర్య మరోసారి చేతులు కలపడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోబోతుందా అనే ఆసక్తి అప్పుడే కోలీవుడ్ వర్గాల్లో నెలకొంది.
We are happy to welcome the gorgeous and talented @IamKrithiShetty onboard #Suriya41!@Suriya_offl #DirBala #Jyotika @gvprakash @rajsekarpandian #Balasubramaniem pic.twitter.com/AIvrBXTvlJ
— 2D Entertainment (@2D_ENTPVTLTD) March 28, 2022