Krithi Shetty: మూడు సినిమాలతోనే పాన్ ఇండియా స్టార్‌గా కృతి శెట్టి..?

ఉప్పెన చిత్రంతో టాలీవుడ్‌లో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి శెట్టి, ఆ సినిమా విజయంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు......

Krithi Shetty: మూడు సినిమాలతోనే పాన్ ఇండియా స్టార్‌గా కృతి శెట్టి..?

Krithi Shetty To Star Opposite Prabhas

Krithi Shetty: ఉప్పెన చిత్రంతో టాలీవుడ్‌లో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి శెట్టి, ఆ సినిమా విజయంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. కాగా ఉప్పెన చిత్రంతో భారీ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ వెంటవెంటనే సినిమాలు ఏమీ చేయకుండా చాలా సెలెక్టివ్‌గా చిత్రాలు ఎంచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే నానితో శ్యామ్ సింగ రాయ్, అక్కినేని నాగార్జున-నాగచైతన్యల బంగార్రాజు చిత్రాల్లో మంచి పాత్రలను పట్టడంలో ఈ బ్యూటీ సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు కూడా అదే ధోరణిలో చాలా చక్కగా తన పాత్రలను ఎంచుకుంటూ వెళ్తోంది. అయితే ఈ బ్యూటీ చేసింది మూడు సినిమాలే అయినా అప్పుడే పాన్ ఇండియా స్టార్‌గా మారే అవకాశం తనకు రాబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Krithi Shetty: వారియర్‌కి జంటగా మహాలక్ష్మి.. ఫస్ట్ లుక్ రిలీజ్!

అవును.. మూడే సినిమాలు చేసిన కృతి శెట్టికి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా నటించే అవకాశం రాబోతున్నట్లు తెలుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటంచబోయే ఓ సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్‌గా తీసుకునేందుకు చిత్ర యూనిట్ ఆలోచిస్తుందట. దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ ఓ హార్రర్ కామెడీ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముందుగా ముగ్గురు హీరోయిన్లను తీసుకోవాలని అనుకున్నారట. వారిలో రాశీ ఖన్నా, మాళవికా మోహనన్, శ్రీలీలా పేర్లు వినిపించాయి.

కానీ ఇప్పుడు ఈ ముగ్గురిలో మాళవికా మోహనన్‌ను పక్కనబెట్టి కృతి శెట్టిని హీరోయిన్‌గా తీసుకుంటే బాగుంటుందని ప్రభాస్ సూచించినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మాళవికా మోహనన్‌కు తెలుగులో పెద్దగా క్రేజ్ లేదని, అందుకే ఈ బ్యూటీని పక్కకు పెట్టాలని చిత్ర యూనిట్ కూడా నిర్ణయించిందట. ఇదే గనక నిజం అయితే, కృతి శెట్టికి అదృష్టం పట్టిందనే చెప్పాలి.

Krithi Shetty: సూర్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ..?

కేవలం మూడు సినిమాలకే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో నటించే ఛాన్స్ వస్తుందంటే ఎవరు మాత్రం వద్దంటారు. కాగా ఈ సినిమా తన కెరీర్‌కు బాగా ఉపయోగపడుతుందని, ఒకవేళ నిజంగానే ఈ ఆఫర్ తనకు వస్తే, కృతి ఖచ్చితంగా ఈ సినిమా చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ ఈ బ్యూటీకి వస్తుందా లేక ఇదంతా కేవలం పుకారుగానే మిగులుతుందా అనేది తెలియాలంటే సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.