Krithi Shetty: సూర్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ..?

అదృష్టం కలిసొస్తే ఎంతో కష్టపడితేగాని గుర్తింపు ఒక్క సినిమాతో వచ్చేస్తుందని నిరూపించింది అందాల భామ కృతి శెట్టి. తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్.....

Krithi Shetty: సూర్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ..?

Krithi Shetty In Suriya Next Movie

Krithi Shetty: అదృష్టం కలిసొస్తే ఎంతో కష్టపడితేగాని గుర్తింపు ఒక్క సినిమాతో వచ్చేస్తుందని నిరూపించింది అందాల భామ కృతి శెట్టి. తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ చాలా సినిమాలు చేసినా రాని ఇమేజ్, ఈ బ్యూటీకి ఒక్క ‘ఉప్పెన’ సినిమాతోనే వచ్చింది. ఈ సినిమాలో బేబమ్మ పాత్రలో అమ్మడి పర్ఫార్మెన్స్‌కు టాలీవుడ్ జనాలు బాగా ఇంప్రెస్ అయ్యారు. ఇక ఆమెను కృతి శెట్టి అనే పేరుకంటే కూడా బేబమ్మ అనే పేరుతోనే ఎక్కువగా పిలుస్తున్నారు.

Krithi Shetty: వారియర్‌కి జంటగా మహాలక్ష్మి.. ఫస్ట్ లుక్ రిలీజ్!

ఉప్పెన్ ఇచ్చిన సక్సెస్‌తో అమ్మడు అక్కినేని నాగార్జున, నాగచైతన్యల మల్టీస్టారర్ మూవీ ‘బంగార్రాజు’లో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో సర్పంచ్ నాగలక్ష్మీ అనే పాత్రలో నటించి ఆడియెన్స్‌ను మరోసారి మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు అందుకున్న ఈ బ్యూటీకి ఇప్పుడు ఓ అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో సూర్య నటించబోయే నెక్ట్స్ మూవీలో కృతి శెట్టికి ఓ మంచి ఆఫర్ లభించినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇటీవల ‘ఈటి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హీరో సూర్య. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రావడం, రొటీన్ మాస్ అంశాలు ఈ సినిమాలో ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిరస్కరించారు. దీంతో ‘ఈటి’ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఇక ఈ సినిమా ఎఫెక్ట్ నుండి బయటపడేందుకు సూర్య వెంటనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ దర్శకుడు బాలా డైరెక్షన్‌లో సూర్య ఓ సినిమా చేయబోతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Krithishetty : కృతిశెట్టి ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా?? కృతి ఎన్ని భాషలు మాట్లాడగలదో తెలుసా??

ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కృతి శెట్టిని చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే సూర్య-బాలా కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో కోలీవుడ్‌లో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి నిజంగానే ఈ సినిమాలో కృతి శెట్టి నటించబోతుందా అనే విషయంపై అటు చిత్ర యూనిట్ కానీ, ఇటు బేబమ్మ కానీ ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. త్వరలోనే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఓ క్లారిటీ ఇస్తుందని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. నిజంగానే కృతి శెట్టి ఈ సినిమాలో నటిస్తే.. అది ఆమె కెరీర్‌కు మరింత బూస్టప్ ఇవ్వడం ఖాయమని అభిమానులు అంటున్నారు.