Ram Charan: రామ్ చరణ్ ‘ఒంగోలు గిత్త’.. నటనతోనే పోటీపడ్డాడు.. ట్రెండ్ అవుతున్న బ్రహ్మానందం కామెంట్స్
రామ్ చరణ్(Ram Charan) నటనపై ప్రశంసలు కురిపించిన బ్రహ్మానందం.
Comedian brahmanandam sensational comments on ram charan peddi movie
- జూన్ 4న ‘పెద్ది’ భారీ విడుదల.
- చరణ్ నటనపై బ్రహ్మానందం ప్రశంసలు.
- రామ్ చరణ్ ఒక ‘ఒంగోలు గిత్త’.
Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటనపై టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Peddi: తెలంగాణాలో ‘పెద్ది’ టికెట్ ధరలు పెంపు.. ప్రీమియర్ షోస్ కి గ్రీన్ సిగ్నల్
ఇటీవల ఒక ప్రముఖ సినిమా క్రిటిక్ మాట్లాడారు. ఆయనతో హాస్యనటుడు బ్రహ్మానందం ఫోనులో దాదాపు అరగంట పాటు కేవలం రామ్ చరణ్ గురించే మాట్లాడినట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతోనే పోటీపడ్డాడని, స్క్రీన్ మీద ఆయన ఎనర్జీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ప్రశంసించారు. చరణ్ నటనలోని వైవిధ్యం, తీవ్రత చూసి తాను ఎంతగానో ముగ్ధుడనయ్యానని, ఈ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని బ్రహ్మానందం అన్నారట.
రామ్ చరణ్(Ram Charan)ను ‘ఒంగోలు గిత్త’తో పోలుస్తూ బ్రహ్మానందం గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట. చరణ్‌లో ఎన్ని నాపరాళ్ళనైనా ఈడ్చుకెళ్లగలిగేంత అపారమైన శక్తి ఉందని, ఆయన నటనలోని పవర్ అలాంటిదని కొనియాడారట. బ్రహ్మానందం చేసిన ఈ వ్యాఖ్యలతో ‘#RamCharan’ హ్యాష్‌ట్యాగ్ నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వ్యాఖ్యల పట్ల రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే జూన్ 4న థియేటర్లలో ‘పెద్ది’ సృష్టించబోయే బాక్సాఫీస్ సునామీ కోసం, చరణ్ మాస్ విశ్వరూపం కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
