Laahe Laahe : 50 మిలియన్ల మార్క్ టచ్ చేసిన మెగా సాంగ్..

ఈ లిరికల్ సాంగ్ 50 మిలియన్ల మార్క్ దాటింది.. అలాగే 6 లక్షలకు పైగా లైక్స్ సాధించింది..

Laahe Laahe : 50 మిలియన్ల మార్క్ టచ్ చేసిన మెగా సాంగ్..

Laahe Laahe From Acharya Hits 50million Views Milestone On Youtube

Updated On : June 8, 2021 / 11:54 AM IST

Laahe Laahe: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో ఫుల్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. వరుసగా సినిమాలు లైన్‌లో పెడుతూ ఫ్యాన్స్, ఆడియెన్స్ అండ్ ఇండస్ట్రీ వర్గాలవారిని సర్‌ప్రైజ్ చేస్తున్నారు. చిరు, చరణ్, కొరటాల కాంబోలో రానున్న ప్రెస్టీజియస్ ఫిలిం ‘ఆచార్య’.. ‘ఖైదీ నెం:150’ లో తన మెస్మరైజింగ్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టిన మెగాస్టార్ తర్వాత సినిమా ‘సైరా’ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌కి చెందింది కావడంతో స్టెప్పులెయ్యడానికి వీలు పడలేదు. ఆ బాకీ ఇప్పుడు వడ్డీతో సహా కలిపి ఇచ్చెయ్యబోతున్నారు.

ఇటీవల ‘ఆచార్య’ లోని ‘లాహే లాహే’ లిరికల్ సాంగ్ రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది.. మెలోడి బ్రహ్మ మణిశర్మ ట్యూన్‌కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా హారికా నారయణ్, సాహితి చాగంటి గొంతు కలిపారు. సీనియర్ హీరోయిన్ సంగీతతో కలిసి కాజల్ అగర్వాల్ ఈ పాటలో బ్యూటిఫుల్‌గా పర్ఫార్మ్ చేశారు.

ఇక మెగాస్టార్ స్టెప్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనేముంది.. కనిపించింది కాసేపే అయినా ఎప్పటిలానే అదరగొట్టేశారు. ఇప్పుడీ పాట మరో మైల్ స్టోన్‌ను రీచ్ అయింది. ఈ లిరికల్ సాంగ్ 50 మిలియన్ల మార్క్ దాటింది. అలాగే 6 లక్షలకు పైగా లైక్స్ సాధించింది. సెకండ్ వేవ్ కారణంగా ‘ఆచార్య’ బ్యాలెన్స్ షూటింగ్ వాయిదా పడింది. లేకపోతే మే 13న సినిమా విడుదల కావాల్సిఉంది.