Mahesh Babu: షూటింగ్‌కు రెడీ అవుతున్న మహేష్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుమారుడు, స్టార్ హీరో మహేష్ బాబు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాడు. కృష్ణ గారికి సంబంధించిన అంతిమ కార్యక్రమాలను మహేష్ పూర్తి చేస్తున్నాడు. అయితే మహేష్‌కు ఇలాంటి ఆపత్కాలంలో దర్శకుడు త్రివిక్రమ్ తోడుగా నిలుస్తున్నాడు. ఆయన వెంటే ఉంటూ మహేష్‌కు ధైర్యాన్ని ఇస్తున్నాడు.

Mahesh Babu: షూటింగ్‌కు రెడీ అవుతున్న మహేష్..?

Mahesh Babu Getting Ready For Shooting

Updated On : November 25, 2022 / 7:04 PM IST

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుమారుడు, స్టార్ హీరో మహేష్ బాబు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాడు. కృష్ణ గారికి సంబంధించిన ఆచార కార్యక్రమాలను మహేష్ పూర్తి చేస్తున్నాడు. అయితే మహేష్‌కు ఇలాంటి ఆపత్కాలంలో దర్శకుడు త్రివిక్రమ్ తోడుగా నిలుస్తున్నాడు. ఆయన వెంటే ఉంటూ మహేష్‌కు ధైర్యాన్ని ఇస్తున్నాడు.

Mahesh Babu : కృష్ణ మరణంపై మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్..

ఈ క్రమంలో ఇంట్లోనే ఉంటే మహేష్ మరింత దు:ఖంలోకి వెళ్తాడని, ఆయన్ని సినిమా షూటింగ్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు త్రివిక్రమ్. మహేష్ నెక్ట్స్ మూవీని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాకు సంబంధించి సమయం దొరికినప్పుడల్లా మహేష్‌తో మాట్లాడుతున్నాడట. ఇలా మహేష్‌ను విషాదం నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం త్రివిక్రమ్ చేస్తున్నాడు. దీంతో త్రివిక్రమ్‌ను మహేష్ అభిమానులు అభినందిస్తున్నారట.

Mahesh Babu : కృష్ణా నదిలో సూపర్ స్టార్ అస్థికలు నిమజ్జనం.. విజయవాడ చేరుకున్న మహేష్ బాబు..

అయితే, తాజాగా మహేష్‌ను తన నెక్ట్స్ మూవీ షూటింగ్‌లో పాల్గొనేలా త్రివిక్రమ్ ఆయన్ను రెడీ చేస్తున్నాడట. ఇప్పటికే అనుకున్న సమయానికంటే ఎక్కువగా ఈ సినిమాకు బ్రేక్ వచ్చిందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అందుకే అన్నీ అనుకున్నట్లు కుదిరితే, డిసెంబర్ మొదటి వారంలోనే మహేష్‌తో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడట. మరి మహేష్ నిజంగానే షూటింగ్‌లో జాయిన్ అవుతాడా లేడా అనేది చూడాలి.