Mahesh Babu
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఇప్పటికే ఆడియెన్స్‌లో ఎలాంటి బజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను పూర్తిగా ఆర్థిక నేరాల బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Sarkaru Vaari Paata: పెన్నీ సాంగ్.. మహేష్ క్రేజ్‌కు మరో మచ్చుతునక!
కాగా ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్స్ టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఉగాది కానుకగా ఈ సినిమా నుండి తాజాగా ఓ అదిరిపోయే పోస్టర్‌ను చిత్రయ యూనిట్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో మహేష్ బాబు పక్కా మాస్ అవతారంలో మనకు కనిపిస్తున్నాడు. రౌడీలను కొట్టేందుకు తన నడుముకు ఉన్న బెల్టును బిగిస్తున్న మహేష్‌ను మనకు చిత్ర యూనిట్ ఈ పోస్టర్‌లో చూపెట్టారు.
Sarkaru Vaari Paata: అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన థమన్!
మొత్తానికి పండగ పూట మహేష్ బాబు సినిమా నుండి ఈ పోస్టర్ రావడంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మహేష్ బాబు సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, ఇటీవల ఆయన ఈ సినిమాకు సంబంధించిన రికార్డింగ్ పనులు కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాను వేసవి కానుకగా మే 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
#SarkaruVaariPaata ?? pic.twitter.com/6qyFKyfF11
— Mythri Movie Makers (@MythriOfficial) April 2, 2022