Narendra Modi: సంస్కరణలు కష్టంగానే ఉంటాయి కానీ..: మోదీ

సోమవారం బెంగళూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రభుత్వం తీసుకునే ఎన్నో నిర్ణయాలు, సంస్కరణలు అప్పుడు కష్టంగానే అనిపిస్తాయి. కానీ, కొంతకాలం తర్వాత వాటి ఫలితాల్ని దేశం మొత్తం చూస్తుంది.

Narendra Modi: ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు, సంస్కరణలు మొదట ఇబ్బందిగానే ఉన్నప్పటికీ, కొంతకాలం తర్వాత వాటి ఫలితాల్ని దేశం మొత్తం అనుభవిస్తుందని అభిప్రాయపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆయన కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

Agniveer: అగ్నివీర్ నోటిఫికేషన్ జారీ.. జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

సోమవారం బెంగళూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రభుత్వం తీసుకునే ఎన్నో నిర్ణయాలు, సంస్కరణలు అప్పుడు కష్టంగానే అనిపిస్తాయి. కానీ, కొంతకాలం తర్వాత వాటి ఫలితాల్ని దేశం మొత్తం చూస్తుంది. సంస్కరణలు దేశాన్ని కొత్త శిఖరాలకు చేరుస్తాయి’’ అని మోదీ వ్యాఖ్యానించారు. తాజాగా అగ్నివీర్ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను ఉద్దేశించే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. అయితే, మోదీ తన ప్రసంగంలో ఎక్కడా అగ్నివీర్ లేదా అగ్నిపథ్ ప్రస్తావన తీసుకురాలేదు. పరోక్షంగా మాత్రమే వీటి గురించి ప్రస్తావించారు.

Presidential race: రాష్ట్రపతి రేసు నుంచి గోపాల క్రిష్ణ ఔట్!

మరోవైపు ఎన్ని ఆందోళనలు, వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసే ఉద్దేశ్యమే లేదని కేంద్రం స్పష్టం చేసింది. యువకుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని పథకంలో కొన్ని మార్పులు మాత్రం చేస్తోంది. అర్హత వయస్సు పెంపుతోపాటు, సైన్యంలో పది శాతం రిజర్వేషన్లు కల్పించింది.

ట్రెండింగ్ వార్తలు