Presidential race: రాష్ట్రపతి రేసు నుంచి గోపాల క్రిష్ణ ఔట్!

అత్యున్నత పదవి కోసం నా పేరు పరిశీలించినందుకు ప్రతిపక్షాలకు ధన్యవాదాలు. జాతికోసం పనిచేయగలిగే, నా కంటే సమర్ధవంతమైన వ్యక్తిని ప్రతిపక్షాలు పరిగణనలోకి తీసుకుంటాయని అనుకుంటున్నా అంటూ గోపాల క్రిష్ణ గాంధీ తన ప్రకటనలో పేర్కొన్నారు.

Presidential race: రాష్ట్రపతి రేసు నుంచి గోపాల క్రిష్ణ ఔట్!

Presidential Race

Presidential race: రాష్ట్రపతి ఎన్నిక కోసం ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పరిశీలనలో ఉన్న గోపాల క్రిష్ణ గాంధీ ఈ రేసు నుంచి తప్పుకున్నారు. తాను రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు గోపాల క్రిష్ణ గాంధీ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు తనను పరిశీలినలోకి తీసుకున్న ప్రతిపక్షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Agniveer: అగ్నివీర్ నోటిఫికేషన్ జారీ.. జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

‘‘అత్యున్నత పదవి కోసం నా పేరు పరిశీలించినందుకు ప్రతిపక్షాలకు ధన్యవాదాలు. జాతికోసం పనిచేయగలిగే, నా కంటే సమర్ధవంతమైన వ్యక్తిని ప్రతిపక్షాలు పరిగణనలోకి తీసుకుంటాయని అనుకుంటున్నా’’ అంటూ గోపాల క్రిష్ణ గాంధీ తన ప్రకటనలో పేర్కొన్నారు. గోపాల క్రిష్ణ గాంధీ మహాత్మా గాంధీ మనవడు అనే సంగతి తెలిసిందే. ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. శ్రీలంకతోపాటు ఇతర దేశాల్లోనూ భారత రాయబారిగా కొనసాగారు. గోపాల క్రిష్ణ కంటే ముందు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాశ్మీర్ నేత ఫరూక్ అబ్దుల్లా పేర్లు రాష్ట్రపతి రేసు కోసం ప్రతిపక్షాలు పరిశీలించాయి. అయితే, ఇద్దరూ ఈ విషయంలో పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేశారు. దీంతో ప్రతిపక్షాలు గోపాల క్రిష్ణ పేరును పరిశీలించాయి.

Pawan Kalyan: దసరా తర్వాత వైసీపీ నాయకుల సంగతి చూస్తాం.. అప్పటి వరకు భరిస్తాం

అయితే, ఈ విషయంలో నిర్ణయం చెప్పేందుకు కొంత సమయం కావాలని ఆయన అడిగారు. తాజాగా రాష్ట్రపతి పదవికి పోటీ చేయకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రతిపక్షాలు ఇప్పుడు మరొకరి పేరును పరిశీలించే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంలో ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం రావడం లేదు. కాగా, వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. జూలై 21న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. కొత్త రాష్ట్రపతి జూలై 25న పదవీ బాధ్యతలు చేపడుతారు.