Pawan Kalyan: దసరా తర్వాత వైసీపీ నాయకుల సంగతి చూస్తాం.. అప్పటి వరకు భరిస్తాం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని మానసికంగా హింసిస్తున్నారు. రాజకీయ కక్ష తీర్చుకోవడానికి మాత్రమే అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారు. వైసీపీ నేతలు హద్దులు మీరి మాట్లాడుతున్నారు. మీరేం మాట్లాడినా దసరా దాక భరిస్తాం. ఆ తరువాత వైసీపీ నాయకుల సంగతి చూస్తాం అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

Pawan Kalyan: దసరా తర్వాత వైసీపీ నాయకుల సంగతి చూస్తాం.. అప్పటి వరకు భరిస్తాం

Pawan Kalyan

Updated On : June 19, 2022 / 8:16 PM IST

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని మానసికంగా హింసిస్తున్నారు. రాజకీయ కక్ష తీర్చుకోవడానికి మాత్రమే అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారు. వైసీపీ నేతలు హద్దులు మీరి మాట్లాడుతున్నారు. మీరేం మాట్లాడినా దసరా దాక భరిస్తాం. ఆ తరువాత వైసీపీ నాయకుల సంగతి చూస్తాం అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాపట్ల జిల్లాలో పర్యటించారు. 80 మంది కౌలు రైతులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు.

Pawan kalyan : జనసేనకు మెగా ఫ్యామిలీ విరాళాలు..

పర్చూరులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్ మాట్లాడారు. యువకులకు ఏదైనా ఉద్యోగం రావాలంటే ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు. కానీ క్రిమినల్ కేసులు ఉన్నవారు ఎమ్మెల్యేలు ఎలా అవుతున్నారు అంటూ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులకు ఒక రూల్, సామాన్యులకు ఒక రూలా అంటూ పవన్ అన్నారు. ఒకసారి గెలిస్తే ఐదేళ్లపాటు ఏం చేయలేరనే ధీమాతో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారని, సరిగా పనిచేయకపోతే రెండేళ్ల తర్వాత రీకాల్ చేసే విధంగా చట్టం రావాలంటూ పవన్ అభిప్రాయ పడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.5లక్షల కోట్లు అప్పుతెచ్చారని, ఏం చేశారో వైసీపీ ఎమ్మెల్యేలను అడగండి, రైతులకు రూ.2వేల కోట్లు ఇచ్చామని చెబుతున్నారు, ఏ జిల్లాకు ఎంత ఇచ్చారో వివరంగా చెప్పరు అంటూ పవన్ అన్నారు.

UP bulldozer baraat: యోగి ఇలాకాలో.. ముస్లిం జంట వివాహంలో ‘బుల్డోజర్ బరాత్’..

2024లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని పవన్ అన్నారు. ఈసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వండని ప్రజలను పవన్ కోరారు. జనసేన అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని నిందించటం సరికాదని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు ఇవ్వాలని మన ఎంపీలు గట్టిగా అడగరని, ఢిల్లీలో కూర్చుని వ్యాపారాలు చేసుకుంటారంటూ పవన్ విమర్శించారు. బాధ్యతగల వ్యక్తుల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుందని పవన్ అన్నారు.