Pawan kalyan : జనసేనకు మెగా ఫ్యామిలీ విరాళాలు..

గతంలో పవన్ తల్లి తన సొంత డబ్బు 25 లక్షలు జనసేన కోసం విరాళంగా ఇచ్చింది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంతా పవన్ పార్టీకోసం విరాళాలు ఇచ్చారు.........

Pawan kalyan : జనసేనకు మెగా ఫ్యామిలీ విరాళాలు..

Janasena

Updated On : June 14, 2022 / 1:44 PM IST

Pawan kalyan :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో మరో పక్కా పాలిటిక్స్ తో బిజీ బిజీగా ఉన్నారు. ఇక ఎన్నికలకు రెండేళ్లు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. త్వరలో దసరా తర్వాత నుంచి రాష్ట్రమంతా పర్యటిస్తారని ఇటీవలే ప్రకటించారు. అలాగే దాదాపు 10 బ్లాక్ కార్లు కాన్వాయ్ లాగా కనపడేలా కొన్నారు జనసేన పార్టీ కోసం. ఇలా అన్ని రకాలుగా రాజకీయాల్లో మరింత దూకుడు ప్రదర్శించాడానికి రెడీ అవుతున్నారు పవన్.

రాజకీయ పార్టీలకు పలువురు ప్రముఖులు విరాళాలు ఇస్తారన్న సంగతి తెలిసిందే. జనసేనకు కూడా పలువురు విరాళాలు ఇస్తున్నారు. గతంలో పవన్ తల్లి తన సొంత డబ్బు 25 లక్షలు జనసేన కోసం విరాళంగా ఇచ్చింది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంతా పవన్ పార్టీకోసం విరాళాలు ఇచ్చారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 10 లక్షలు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ 10 లక్షలు, నిహారిక అయిదు లక్షలు, పంజా వైష్ణవ్ తేజ్ అయిదు లక్షలు, మిగిలిన కుటుంబ సభ్యులు కలిసి మరో అయిదు లక్షలు విరాళంగా ఇచ్చారు. మొత్తం 35 లక్షల రూపాయలని పవన్ పార్టీకి మెగా ఫ్యామిలీ విరాళంగా ఇచ్చింది.

Virata Parvam : మూడు రోజుల్లో విరాటపర్వం.. సాయిపల్లవి క్రేజ్‌తో పెరిగిపోతున్న అంచనాలు..

తాజాగా ఈ డబ్బులని చెక్కుల రూపంలో నాగబాబు, అతని భార్య కలిసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కి అందించారు. అయితే ఈ డబ్బులు పవన్ చేసే కౌలు రైతు భరోసా కోసం ఉపయోగించనున్నారని, మెగా ఫ్యామిలీ కూడా అదే కోరుకుంటుందని తెలిపారు. ఇలా మెగా ఫ్యామిలీ అంతా పవన్ కి సపోర్ట్ నిలబడటంతో మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.