Virata Parvam : మూడు రోజుల్లో విరాటపర్వం.. సాయిపల్లవి క్రేజ్‌తో పెరిగిపోతున్న అంచనాలు..

థియేటర్లోకి వస్తుందో రాదో అనుకున్న విరాటపర్వం జూన్ 17న రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్నారు మేకర్స్. రోజు రోజుకీ అంచనాలు పెంచేస్తున్నారు................

Virata Parvam : మూడు రోజుల్లో విరాటపర్వం.. సాయిపల్లవి క్రేజ్‌తో పెరిగిపోతున్న అంచనాలు..

Virata Parvam

Virata Parvam :  ప్రస్తుతం టాలీవుడ్ లో విరాటపర్వం హవా కనిపిస్తోంది. కర్నూల్ లో వర్షంలోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ చేశారు. వరంగల్ లో ఆత్మీయ సభ గ్రాండ్ సక్సెస్ చేశారు ఆడియన్స్. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసింది. వెన్నెల పాత్రతో సాయిపల్లవి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

థియేటర్లోకి వస్తుందో రాదో అనుకున్న విరాటపర్వం జూన్ 17న రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్నారు మేకర్స్. రోజు రోజుకీ అంచనాలు పెంచేస్తున్నారు టీమ్. లేటెస్ట్ గా వరంగల్ లో ఆత్మీయ సభకు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా సార్లు సినిమాలు చప్పట్లు, విజిల్స్, ఫ్యాన్స్ కోసం చేస్తుంటాం.. కాని, ఈ సినిమా మాత్రం చప్పట్ల మధ్యలో సైలెన్స్ గా కూర్చుని అరే ఇది నిజమే కదా… అని ఒకరు చూస్తుంటారు చూడు వాళ్ల కోసం ఈ సినిమా చేశామన్నారు రానా.

వరంగల్ ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చిన ఫీలింగే కలుగుతుంది. ఇది మన సినిమా అందరూ చూసి, ఆదరించాలి. వెన్నెల క్యారెక్టర్ తనకు వెరీ వెరీ స్పెషల్ అన్నట్టు చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఆమె మాటలకి మంత్ర ముగ్ధులైపోయారు వరంగల్ వాసులు, తెలుగు ఆడియన్స్. వేణు ఊడుగులు డైరెక్షన్ లో సురేష్ బాబు, చెరుకూరి సుధాకర్ కంబైన్డ్ గా నిర్మించిన ఈ విరాట పర్వం పైన ఆడియన్స్ కే కాదు, మేకర్స్ కు కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

Mahesh Babu : ఫ్యామిలీలతో కలిసి ఫారెన్ టూర్స్‌లో ఎంజాయ్ చేస్తున్న మహేష్, చరణ్

రానా, సాయిపల్లవి సిల్వర్ స్క్రీన్ మీద మెస్మరైజింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చారా అన్నట్టే ఉంది ఇప్పటికే రిలీజ్ అయిన ట్రయిలర్ చూస్తుంటే. సాయిపల్లవి సెంట్రిక్ గా ఈ సినిమా కథ ఉంటుందని చెబుతూ ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేశారు విరాటపర్వం మేకర్స్. ఇక ఈ మధ్య ట్రయిలర్ చూసిన బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ కూడా ప్రశంసల వర్షం కురిపించి సినిమాపట్ల ఆసక్తిని కనబరిచారు. ఈ సినిమా చూడటానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టు ట్వీట్ చేసి, మరింత హైప్ పెంచారు.

సాయిపల్లవికి పెద్ద అభిమానినని చెప్పుకుని, సాయిపల్లవి క్రేజ్ ను కూడా ఇంకింత పెంచేశారు కరణ్ జోహార్. ఇంకా రీసెంట్ గా ఈ సినిమా చూసిన నిఖిల్ కూడా ఈ సినిమాను ఆకాశానికెత్తేశారు. నిలిచిపోయే సినిమా అవుతుందన్నారు. యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా అదే మాట చెబుతూ ఈ సినిమా పట్ల ఆడియన్స్ లో మరింత కుతూహలాన్ని పెంచారు. సీరియస్ సబ్జెక్ట్ లో హార్ట్ టచింగ్ లవ్ స్టోరీని మింగిల్ చేసి, విరాటపర్వం తెరకెక్కించారు వేణు ఊడుగుల. సురేష్ బొబ్బిలి సంగీతంతో ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సినీ లవర్స్ ను ఎట్రాక్ట్ చేశాయి. సినిమా కోసం మరింత ఆతృతగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు, ముఖ్యంగా సాయి పల్లవి అభిమానులు.