మెగాభిమాని ‘సుందరి’ స్టెప్స్.. చిరు చూస్తే సర్‌ప్రైజ్ అవాల్సిందే..

చిరు పాటకు మెగాభిమాని వేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది..

  • Published By: sekhar ,Published On : June 19, 2020 / 10:54 AM IST
మెగాభిమాని ‘సుందరి’ స్టెప్స్.. చిరు చూస్తే సర్‌ప్రైజ్ అవాల్సిందే..

చిరు పాటకు మెగాభిమాని వేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది..

మెగాస్టార్ చిరంజీవి.. డ్యాన్స్‌కి పెట్టింది పేరు చిరు.. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత ‘ఖైదీ నెం.150’తో రీ ఎంట్రీ ఇచ్చి, జస్ట్ టైమ్ గ్యాప్ అంతే అన్నట్టుగా ఏమాత్రం తగ్గని ఈజ్, ఎనర్జీతో స్టెప్స్ వేసి ఫ్యాన్స్, ప్రేక్షకులను అలరించారు. బాస్ మూమెంట్స్‌కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్‌ తోడవడంతో థియేటర్లలో రచ్చ రంబోలా చేశారు అభిమానులు. ఇక చిరు ఫ్యాన్స్ విషయానికొస్తే చిరు హెయిర్ స్టైల్, వాకింగ్ స్టైల్ దగ్గరినుండి ప్రతీది అనుసరిస్తుంటారు. కొందరు చిరుపై అభిమానంతో డ్యాన్స్ కూడా నేర్చుకుంటుంటారు.

తాజాగా ఓ మెగాభిమాని చిరు పాటకు స్టెప్స్ వేశాడు. ‘సుందరి’ సాంగ్‌లో చిరు స్టెప్స్ ఏ స్థాయిలో ఉంటాయో కొత్తగా చెప్పనవసరం లేదు. తాజాగా చిరు అభిమాని తన డ్యాన్స్‌తో నెటిజన్లను ఆకట్టుకున్నాడు. విశేషం ఏంటంటే అతను భారీకాయంతోనూ అలవోకగా హుషారుగా స్టెప్స్ వేసి ఔరా అనిపించాడు. ఈ టిక్ టాక్  వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాభిమానులు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

Read:  లాక్‌డౌన్ టైమ్.. ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారిన యంగ్ హీరో..