Gang Rape: పదో తరగతి బాలికపై అత్యాచారం.. నిందితులంతా మైనర్లే
హైదర్‌నగర్‌లోని పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థినిపై, ఐదుగురు తోటి విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఓ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారంకు పాల్పడ్డారు.
- Harishth Thanniru
- Published On : November 29, 2022 / 01:32 PM IST
Gang Rape
Gang Rape: హైదరాబాద్ నగర శివారు హయత్ నగర్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై తోటి విద్యార్థులు సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. ఆగస్టులో జరిగిన ఈ ఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలికపై అత్యాచారంకు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితులంతా మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోం తరలించే అవకాశం ఉంది.
హైదర్‌నగర్‌లోని పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థినిపై, ఐదుగురు తోటి విద్యార్థులు అత్యాచారంకు పాల్పడ్డారు. విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఓ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారంకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అత్యాచార ఘటనను సెల్ ఫోన్లో రికార్డు చేశారు. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే వీడియోను బయటపెడతామని బాధితురాలిని బెదిరించారు. దీంతో బాలిక భయంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు.
Girl Gang Raped : హైదరాబాద్ మీర్‌పేటలో బాలికపై గ్యాంగ్‌రేప్
బాలిక భయాన్ని ఆసరాగా తీసుకున్న ఐదుగురు విద్యార్థులు పదిరోజుల తరువాత మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను తీశారు. వీడియోను తోటి స్నేహితులకు చూపించారు. దీంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులంతా మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోంకి తరలించే అవకాశం ఉంది.
