Telangana Weather: మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు!
తెలంగాణలో రాగల మూడు రోజుల (16,17,18) పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి, రెండు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
- Naresh Mannam
- Updated on- June 16, 2021 / 04:42 PM IST
Moderate Rains In Telangana For Another Three Days
Telangana Weather: తెలంగాణలో రాగల మూడు రోజుల (16,17,18) పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి, రెండు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈరోజు దక్షిణ, మధ్య, తూర్పు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ… తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు తేదీలలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని.. తూర్పు, ఉత్తర, వాయువ్య జిల్లాలలో ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది.
ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లోని అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, మధ్య ట్రోపోస్పీయర్ ఎత్తు వరకు కొనసాగుతుండగా ఈ అల్పపీడనం మరింత బలపడి తుఫానుగా ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
Read:Eetala Rajender: ఈటలపై మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి ఘాటు లేఖ!
