Mohan Lal Rejects Shankar Ram Charan Movie Offer
Shankar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన కెరీర్‌లోని 15వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందా అని అప్పుడే సినీ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. కాగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
RC15: శంకర్ హై క్వాలిటీ మేకింగ్.. తడిసి మోపెడవుతున్న బడ్జెట్!
అయితే స్టార్ డైరెక్టర్, మెగా పవర్ స్టార్ ఉన్న ఈ సినిమాలో ఓ అదిరిపోయే ఆఫర్ వస్తే.. నో అని చెప్పాడట ఓ స్టార్ హీరో. చరణ్ లాంటి హీరో నటిస్తున్న సినిమాలో ఛాన్స్ వస్తే నో అని చెప్పిన హీరో ఎవరా అని అనుకుంటున్నారా.. ఈ సినిమాలో శంకర్ ఓ ప్రత్యేక పాత్రను డిజైన్ చేశాడట. అయితే ఇందులో కొంతమేర నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ పాత్రలో నటించాలని కోరుతు శంకర్ అండ్ టీమ్ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ వద్దకు వెళ్లారట.
RC15: చెర్రీ మొదలు పెట్టేస్తున్నాడు.. అమృత్ సర్ లో శంకర్ సినిమా రీస్టార్ట్
కానీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడంతో ఆయన ఈ సినిమాలో చేయనంటూ సున్నితంగా ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారట. దీంతో శంకర్ అండ్ టీమ్ ఖంగుతిన్నారు. అయితే ఈ పాత్ర సినిమాలో చాలా కీలకం కావడంతో మరో స్టార్ యాక్టర్ కోసం వారు అన్వేషిస్తున్నారట. తమిళ నటుడు అరవింద్ స్వామిని ఈ పాత్ర చేయాల్సిందిగా వారు కోరారని.. ఆయన ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Mohan Lal Rejects Shankar Ram Charan Movie
ఇక ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.