RC15: శంకర్ హై క్వాలిటీ మేకింగ్.. తడిసి మోపెడవుతున్న బడ్జెట్!

లాంచింగ్ రోజు కోట్లు వేసుకోమన్నప్పుడే దిల్ రాజుకి అర్ధమై ఉండాలి. రామ్ చరణ్ సినిమా కోసం కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అవ్వాలని. శంకర్ అంటేనే.. భారీ తనానికి మారుపేరు.

RC15: శంకర్ హై క్వాలిటీ మేకింగ్.. తడిసి మోపెడవుతున్న బడ్జెట్!

Rc15

RC15: లాంచింగ్ రోజు కోట్లు వేసుకోమన్నప్పుడే దిల్ రాజుకి అర్ధమై ఉండాలి. రామ్ చరణ్ సినిమా కోసం కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అవ్వాలని. శంకర్ అంటేనే.. భారీ తనానికి మారుపేరు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ రిచ్ నెస్ కోసం తాపత్రయపడే శంకర్.. చరణ్ మూవీ కోసం ఓ రేంజ్ లో ఖర్చు చేయిస్తున్నాడు. ఓపెనింగ్ రోజే శాంపిల్ చూపించిన శంకర్.. దిల్ రాజుకిప్పుడు చుక్కలు చూపిస్తున్నాడు.

RC15: చెర్రీ మొదలు పెట్టేస్తున్నాడు.. అమృత్ సర్ లో శంకర్ సినిమా రీస్టార్ట్

దిల్ రాజు సరదా తీరుస్తున్నాడు డైరెక్టర్ శంకర్. ఆర్ సి 15 కోసం భారీగా ఖర్చు చేయిస్తున్నాడు. సినిమా ఓపెనింగ్ ఫోటోషూట్ కే 2 కోట్లు ఖర్చు పెట్టించిన శంకర్.. స్టార్ కాస్ట్ నుంచి టెక్నీషియన్స్ వరకు అందరికీ సూట్స్ డిజైన్ చేయించి మరీ అప్పుడే తగ్గేదే లే అన్నట్టు ఫోజులు కొట్టాడు. నిర్మాత దిల్ రాజు కోటు వేసుకున్నప్పుడే.. శంకర్ మూవీ కోసం కోట్లు రెడీ చేసుకోవాలని డిసైడ్ అయినట్టు ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దానిని నిజం చేస్తూ ఒక పాట, ఫైట్ సీక్వెల్ కే నిర్మాతకు తడిచి మోపెడైనట్టు తెలుస్తోంది.

Ram Charan : గోదావరి జిల్లాల్లో RC15 షూటింగ్..

ఆర్ సి 15 మూవీలోని ఒక్క పాట కోసం ఏకంగా 10 కోట్ల ఖర్చు అయింది. విఎఫ్ఎక్స్, సిజి, గ్రీన్ మ్యాట్ లు లేని రోజుల్లో కలర్ ఫుల్ గా, న్యాచురల్ గా పాటలను, సీన్స్ ను శంకర్ ఎలా తెరకెక్కించేవాడో.. ఇప్పుడూ అలానే చేస్తున్నాడు. న్యాచురల్ లుక్ కోసం దిల్ రాజుతో కోట్లు ఖర్చు పెట్టించి మరీ షూట్ కానిస్తున్నాడు. అలాగే ఇందులోని ఓ ఫైట్ సీన్ కోసం కూడా 10 కోట్లకు పైగానే ఖర్చయినట్టు చెప్తున్నారు. ఇంత భారీ బడ్జెట్ తో ఓ పాట, ఫైట్ సీక్వెన్స్ ను తెరకెక్కించినట్టు ఈమధ్య కాలంలో ఏ సినిమాకూ వినిపించలేదు.

Ram Charan : ఒక్క పాటకి 20 కోట్లు.. RC15లో మరో అద్భుతం సృష్టించనున్న శంకర్..

నాలుగు గెటప్పుల్లో చరణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. స్టూడెంట్, కలెక్టర్, ఓల్డ్ మ్యాన్ ఇలా ఒక్క సినిమాలోనే మల్టిపుల్ వేరియేషన్స్ ట్రై చేస్తున్నారు. ఇప్పటికి మూడు షెడ్యూల్స్ పూర్తికాగా.. అందులో ఫస్ట్ షెడ్యూల్ పుణేలో కంప్లీట్ అయింది. ఇక్కడ 10 కోట్ల ఖర్చుతో ఇంటెన్స్ లోకేషన్స్ లో చరణ్, కియారాపై పాట షూట్ చేశారు. సెకండ్ షెడ్యూల్ లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో మరో 10 కోట్ల ఖర్చుతో ఫైట్ సీక్వెన్స్ కానిచ్చారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలతో పాటూ వైజాగ్ ఇంటి సెట్ లో మూడో షెడ్యూల్ పూర్తయింది. ఇక ఏప్రిల్ 6 నుంచి పంజాబ్ అమృత్ సర్ లో కీలకమైన సన్నివేశాలతో పాటూ మరో ఫైట్ సీక్వెల్ పని పట్టబోతున్నారు శంకర్.