Ram Charan : గోదావరి జిల్లాల్లో RC15 షూటింగ్..

రామ్ చరణ్ ముంబై నుంచి వచ్చాక ఫిబ్రవరి 10 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం అవ్వనుంది. కొత్త షెడ్యూల్ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరగనుంది. ఇప్పటికే డైరెక్టర్ శంకర్ తో...........

Ram Charan : గోదావరి జిల్లాల్లో RC15 షూటింగ్..

Rc 15

 

RC 15 :   భారీ బడ్జెట్స్ తో సినిమాలని తెరకెక్కించే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో దిల్ రాజు సినిమాని నిర్మిస్తున్నారు. RC15 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ముంబై, పుణెలలో రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇందులో ఒక పాటకే 20 కోట్లు ఖర్చు పెట్టనున్నారని సమాచారం. తాజాగా ఈ సినిమా మూడో షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది.

 

ప్రస్తుతం రామ్ చరణ్ ముంబైలో ఉన్నాడు. రామ్ చరణ్ ముంబై నుంచి వచ్చాక ఫిబ్రవరి 10 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం అవ్వనుంది. కొత్త షెడ్యూల్ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరగనుంది. ఇప్పటికే డైరెక్టర్ శంకర్ తో సహా శంకర్ టీమ్ లోని కొంతమంది గోదావరి జిల్లాలో ఉన్న దోసకాయల పల్లి అనే గ్రామానికి చేరుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రాజమండ్రి, కాకినాడ, కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో జరగనున్నట్లు తెలుస్తుంది.

Naresh : సీనియర్ నటుడు నరేష్.. మొన్న లగ్జరీ కారవాన్.. ఇవాళ లగ్జరీ కార్..

ఈ మేరకు జనవరి 31వ తేదీనే ఏలూరు రేంజ్ డిఐజికి లేఖ కూడా రాశారు. షూటింగ్ నిమిత్తం పోలీస్ శాఖ నుంచి ఒక ఎస్సై తో కూడిన బృందాన్ని తమ బందోబస్తు కోసం పంపాల్సిందిగా సినిమా యూనిట్ కోరారు. దానికి సంబంధించిన చార్జీలు ఏమైనా అయితే తాము సహకరిస్తామని, కరోనా నిబంధనలు అనుసరించి షూటింగ్ జరుపుతామని వీరు రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే ఇక్కడ సాంగ్ షూట్ చేస్తారా లేదా టాకీ పార్ట్ షూట్ చేస్తారా తెలియాల్సి ఉంది. దాదాపు రెండు వారాలు ఈ షెడ్యూల్ ఉండబోతున్నట్టు సమాచారం.