Star Couples : యంగ్ కపుల్స్ ఎంజాయ్‌మెంట్..

మాలీవుడ్ యంగ్ స్టార్ కపుల్స్ అందరూ గెట్ టు గెదర్ అయ్యారు..

Star Couples : యంగ్ కపుల్స్ ఎంజాయ్‌మెంట్..

Mollywood Star Couples

Updated On : June 25, 2021 / 1:58 PM IST

Star Couples: ఎప్పుడూ లైట్స్, స్టార్ట్ కెమెరా, యాక్షన్ సౌండ్స్‌తో, వందలాదిమంది జనలామధ్య షూటింగ్ చేస్తూ బిజీగా ఉండే స్టార్స్ సరదాగా చిల్లౌట్ అయ్యారు. కాసేపు ప్రొఫెషనల్ ప్రెజర్ పక్కన పెట్టి, పర్సనల్ లైఫ్‌ని ఫ్యామిలీతో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. మాలీవుడ్ యంగ్ స్టార్ కపుల్స్ అందరూ గెట్ టు గెదర్ అయ్యారు.

 

View this post on Instagram

 

A post shared by Supriya Menon Prithviraj (@supriyamenonprithviraj)

యాక్టర్ అండ్ రైటర్‌ పృథ్వీరాజ్ సుకుమారన్, భార్య సుప్రియ మీనన్, మలయాళంలో వెర్సటైల్ యాక్టర్‌గా గుర్తింపు పొంది.. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఫాహద్ ఫాజిల్, ‘రాజారాణి’ తో ఆకట్టుకున్న నజ్రియా నజీమ్, యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ దుల్కర్ సల్మాన్, అమల్ సుఫియా.. ఈ కపుల్స్ అంతా ఒక చోట చేరి సందడి చేశారు. సరదాగా గడిపారు.

 

View this post on Instagram

 

A post shared by Dulquer Salmaan (@dqsalmaan)

‘లూసిఫర్’ తో దర్శకుడిగా ఆకట్టుకున్న పృథ్వీరాజ్ ప్రస్తుతం ‘కోల్డ్ కేస్’ సినిమాలో నటిస్తున్నారు. మరోసారి మోహన్ లాల్‌తో సినిమా చెయ్యబోతున్నారు. ఈ మూవీకి ‘బ్రో డాడీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నజ్రియా, నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘అంటే.. సుందరానికీ’.. సినిమాతో తెలుగు తెరకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘లెఫ్టినెంట్ రామ్’(వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh)