Moushumi Chatterjee : నా తల్లి గురించి నెగెటివ్ గా ఎందుకు మాట్లాడుతున్నావ్? మౌసమీ ఛటర్జీని ప్రశ్నించిన కొంకణా సేన్ శర్మ.. అందుకు మౌసమీ ఏం చెప్పారంటే..
మౌసమీ ఛటర్జీ 70 లలో ప్రముఖ నటి. అపర్ణాసేన్ రైటర్, డైరెక్టర్. ఇద్దరూ కలిసి పనిచేశారు. ఆ తరువాత ఏమైందో 2015 లో అపర్ణతో పనిచేస్తే రక్షణ ఉండదంటూ మౌసమీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అపర్ణసేన్ కూతురు కొంకణా సేన్ తన తల్లిపై మౌసమీ చేసిన వ్యాఖ్యల్ని ప్రశ్నించడంతో మరల ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.

Moushumi Chatterjee
Moushumi Chatterjee : మౌసమీ ఛటర్జీ 70లలో ఫేమస్ హీరోయిన్. అపర్ణాసేన్ మంచి రచయిత్రి.. ఇద్దరూ ఒకేసారి కెరియర్‌ని స్టార్ట్ చేశారు. 2010లో రాహుల్ బోస్ సినిమా ‘ది జపనీస్ వైఫ్’ అనే సినిమా కోసం ఇద్దరూ పని చేశారు. బెంగాలి సినిమాని అపర్ణా సేన్ డైరెక్ట్ చేస్తే రాహుల్ అత్తగా మౌసమీ నటించారు. 2013లో వచ్చిన ‘గోయ్నార్ భక్షో’ బెంగాలీ సినిమాకి కూడా మళ్లీ కలిసి పనిచేశారు. ఇందులో అపర్ణాసేన్ డాటర్ కొంకణా సేన్ శర్మ కూడా నటించారు.
Sudha murty comments : “నా కూతురి వల్లే రిషి సునక్ ప్రధాని కాగలిగాడు” సుధామూర్తి కామెంట్స్ వైరల్
ఇదంతా బాగానే ఉంది. 2015లో జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో అపర్ణాసేన్‌ను ఉద్దేశించి మౌసమీ ఛటర్జీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘2015 నుంచి అపర్ణా సేన్‌తో కలిసి పనిచేయడం లేదని.. ఆమె దగ్గర రక్షణ లేదని’ మౌసమీ మాట్లాడారు. అయితే 2015లో మౌసమీ చేసిన ఈ వ్యాఖ్యలను తాజాగా ఆమె కుమార్తె కొంకణా సేన్ ప్రశ్నించారు. ‘నా తల్లి గురించి బహిరంగ వేదికలపై ఎలా నెగెటివ్ కామెంట్స్ చేస్తారు?’ అని అడిగిన ప్రశ్నకు మౌసమీ ఛటర్జీ మళ్లీ స్పందించారు.
‘ఆమె నీకు తల్లి.. కానీ ఆమె నా సినిమాకు డైరెక్టర్.. అలాగే నా కొలీగ్.. నాతోపాటు పనిచేసిన వ్యక్తిగా ఆమె గురించి మాట్లాడే హక్కు నాకుంది..నేను ప్రెస్ కాన్ఫరెన్స్‌కి వెళ్లినపుడు అపర్ణాసేన్ గురించి అడిగారు. అప్పట్లో నాకు అనిపించింది నిర్భయంగా చెప్పాను’ అంటూ మౌసమీ వివరణ ఇచ్చారు.
అప్పటి వ్యాఖ్యలపై ఇప్పుడు స్పందించిన కొంకణాసేన్ .. మౌసమీ చెప్పిన సమాధానికి మరల ఎలా రియాక్ట్ అవుతారో తెలియాలి. కానీ మౌసమీ చేసిన నెగెటివ్ కామెంట్స్‌కి బలమైన కారణం ఉంటుందని మాత్రం జనాలు చెప్పుకుంటున్నారు.