Ranveer Singh : రణ్‌వీర్‌సింగ్ న్యూడ్ ఫోటోషూట్.. విచారణకి రావాలని సమన్లు జారీ చేసిన ముంబై పోలీసులు..
ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్ న్యూడ్ ఫోటోషూట్ తీసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై విచారణకు హాజరు కావాలని కోరుతూ ముంబై పోలీసులు రణ్‌వీర్‌కు సమన్లు జారీ చేశారు. ఆగస్ట్ 22న ఈ వ్యవహారంపై...........
- Saketh U
- Published On : August 13, 2022 / 09:20 AM IST
ranveer singh Photoshoot
Ranveer Singh : ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్ న్యూడ్ ఫోటోషూట్ తీసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది ఆ ఫొటోషూట్ ని విమర్శించగా కొంతమంది మాత్రం సపోర్ట్ చేశారు. అయితే రణవీర్ సింగ్ ఫొటోషూట్ పై కేసు కూడా నమోదయింది. ముంబైకి చెందిన శ్యామ్ మంగారాం అనే ఫౌండేషన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ న్యూడ్ ఫోటోషూట్ ద్వారా రణవీర్ మహిళల మనోభావాలను గాయపరిచాడని ఆ సంస్ధ ఫిర్యాదులో పేర్కొంది. ఇలాంటివాటిని వ్యతిరేకించకపోతే వేరే నటులు కూడా పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేస్తారని, దీన్ని సీరియస్ గా తీసుకోవాలని తెలిపింది.
తాజాగా దీనిపై విచారణకు హాజరు కావాలని కోరుతూ ముంబై పోలీసులు రణ్‌వీర్‌కు సమన్లు జారీ చేశారు. ఆగస్ట్ 22న ఈ వ్యవహారంపై విచారణకు హాజరు కావాలని పోలీసులు రణ్‌వీర్‌సింగ్‌ను ఆదేశించారు. నోటీసులు అందించేందుకు ముంబైలోని రణ్‌వీర్ నివాసానికి పోలీసులు వెళ్లగా ఆ సమయంలో రణవీర్ ఇంట్లో లేకపోవడంతో ఇంట్లో ఉన్నవాళ్ళకి అందించారు. ఆగస్ట్ 22న న్యూడ్ ఫోటోషూట్‌పై రణ్‌వీర్‌ను ముంబై పోలీసులు ప్రశ్నించడంతో పాటు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు కూడా చేస్తారు. మరి దీనిపై రణవీర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
