Mumbai Police : తన ఫ్యామిలీ వద్దకు చేర్చమంటూ పోలీసులను ఆశ్రయించిన వృద్ధురాలు.. పోలీసులు ఏం చేశారంటే?

ఒంటరైన ఓ వృద్ధురాలు తన కుటుంబ సభ్యులను కలుసుకోవాలని ఆరాటపడింది. ఎటూ పాలు పోక పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఆవేదనను అర్ధం చేసుకున్న పోలీసులు తిరిగి ఆమెను తనవారి వద్దకు చేర్చారు.

Mumbai Police :  65 ఏళ్ల వృద్ధురాలు తన కుటుంబం నుంచి విడిపోయింది. తిరిగి వారిని కలవడానికి పోలీసుల్ని ఆశ్రయించింది. వృద్ధురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించి మంచి పనిచేశారు ముంబయి పోలీసులు. నెటిజన్ల మనసు దోచుకున్నారు.

Mumbai Police : ఫ్లై ఓవర్‌పై నిలిచిపోయిన బస్సు.. డ్రైవర్‌కి సాయం చేసిన ప్యాసింజర్లు.. ముంబయి పోలీసులు షేర్ చేసిన వీడియో వైరల్

ముంబయి బాంద్రా టెర్మినస్‌‌లో 65 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటోంది. కుటుంబ సభ్యులతో ఏం సమస్య వచ్చిందో విడిపోయింది. కానీ కొంతకాలంగా ఉత్తరప్రదేశ్‌లో ఉన్న తన కుటుంబసభ్యుల్ని కలుసుకోవాలని ఆందోళన చెందుతోంది. వెళ్లే మార్గం తెలియక తనకు సాయం చేయమంటూ విలే పార్లే పోలీసులను కోరింది.

 

పోలీస్ స్టేషన్‌కి వచ్చిన ఆమెను డిపార్ట్ మెంట్ వారు ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆమెకు తినడానికి ఏమైనా కావాలా? అని అడిగారు. ఆమె సమస్యను విని వెంటనే ఆమె కుటుంబ సభ్యుల అడ్రస్ ఆరా తీసారు. వివరాలు తెలుసుకుని వారికి కబురు పెట్టారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆమె కుటుంబ సభ్యులకు ఆమెను అప్పగించారు. ఇక ఆ వృద్ధురాలు ఆనందానికి హద్దులేదు. పోలీసులకు సంతోషంతో నమస్కరించి తన వారితో ఊరికి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ముంబయి పోలీసులు తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Noida police : స్వీపర్ కుమార్తె పెళ్లికి ఆర్ధిక సాయం అందించి గొప్ప మనసు చాటుకున్న నోయిడా పోలీసులు

ఈ వీడియోను చూసిన ముంబయి జనం పోలీస్ డిపార్ట్ మెంట్ చేసిన మంచి పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘అన్నిచోట్ల పోలీసులు ఇదే విధంగా పనిచేయాలని కోరుకుంటున్నామని.. ముంబయి పోలీసులకు హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్లు పెట్టారు. ఎప్పుడూ సీరియస్ కేసులతో సతమతమయ్యే పోలీసులు ఇలాంటి అంశాలపై వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడం నిజంగా అభినందనీయం.

ట్రెండింగ్ వార్తలు