Mumbai Police : ఫ్లై ఓవర్‌పై నిలిచిపోయిన బస్సు.. డ్రైవర్‌కి సాయం చేసిన ప్యాసింజర్లు.. ముంబయి పోలీసులు షేర్ చేసిన వీడియో వైరల్

'ఐకమత్యం మహా బలం' అంటారు. అది నిరూపించారు ముంబయి జనం. రోడ్డుపై మొరాయించిన బస్సును ముందుకు నడిపించడానికి ఒకటై డ్రైవర్ కి సాయం చేశారు. ముంబయి పోలీసుల మనసు దోచుకున్నారు.

Mumbai Police : ఫ్లై ఓవర్‌పై నిలిచిపోయిన బస్సు.. డ్రైవర్‌కి సాయం చేసిన ప్యాసింజర్లు.. ముంబయి పోలీసులు షేర్ చేసిన వీడియో వైరల్

 Mumbai Police

Mumbai Police :  ప్రయాణిస్తున్న బస్సు ఆగిపోయి మొరాయిస్తే మామూలుగా జనం ఏం చేస్తారు?.. అందరూ బస్సు దిగిపోయి హడావిడిగా వేరే బస్‌ని క్యాచ్ చేస్తారు. కానీ ముంబయిలో ప్యాసింజర్లు మంచి పని చేసి పోలీసుల ప్రశంసలు అందుకున్నారు.

A brave boy : ట్రాఫిక్‌లో డ్రైవ్ చేస్తూ అపస్మారక స్థితికి వెళ్లిపోయిన బస్సు డ్రైవర్.. 67 మంది ప్రాణాలు కాపాడిన ఓ స్టూడెంట్ సాహసం చదవండి

ముంబయి ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఇక ఉద్యోగాలకు వెళ్లే టైంలో మరింత హడావిడి కనిపిస్తుంది. అలాంటి టైంలో ఓ ఫ్లై ఓవర్‌పై బస్సు ట్రబుల్ ఇచ్చి నిలిచిపోయింది. పనులకు, ఉద్యోగాలకు వెళ్లే టైంలో బస్సు ట్రబుల్ ఇస్తే జనం ఒక్క క్షణం నిలబడతారా? తిట్టుకుంటూ వేరే బస్సు కోసం పరుగులు తీస్తారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. బస్సు దిగిన ప్రయాణికులంతా కలిసి బస్సును నెడుతూ డ్రైవర్‌కి సాయం అందించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

 

‘ ఇది చాలా విలువైన సమయం.. అయినా కూడా సమయం పక్కన పెట్టి ఒకరికొకరు ఎంత సాయం చేసుకున్నామనేది ముఖ్యం’ అనే శీర్షికతో ఈ వీడియోను మొదటగా @medohh777 ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు. ఆ వీడియోను ముంబయి పోలీసులు ”ముంబయి మూమెంట్స్ – Ctrl+S! ..ముంబయి బలం ముంబైకర్లే.. మా పోలీస్ స్నేహితుడు అక్కడివారితో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందంటూ’ ఈ వీడియోని షేర్ చేశారు.

incredible woman : హింసించిన భర్తను విడిచిపెట్టింది.. నువ్వు ఏమీ చేయలేవు అన్న భర్తకు సమాధానం చెప్పింది.. ఆమె ఇప్పుడు 13 బస్సుల ఓనర్

ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. ‘ఐకమత్యంతో ఉంటే విజయం సాధిస్తామన్నది ఇలాంటి ఘటనలు చూస్తుంటే అర్ధమవుతుందని కొందరు.. ఇలా సాయపడే తత్వం ముంబయిలో మాత్రమే ఉందని’ మరికొందరు కామెంట్లు పెట్టారు. ఇక సమస్యలపైనా.. సంబరాలపైనా ముంబయి పోలీసులు సోషల్ మీడియాల బాగానే స్పందిస్తూ ఉంటారు. ఇలా జనానికి-పోలీసులకి మధ్య స్నేహ పూరిత వాతావరణ ఉంటే క్రైం రేటు మరింత తగ్గే అవకాశం ఉంటుంది.