A brave boy : ట్రాఫిక్‌లో డ్రైవ్ చేస్తూ అపస్మారక స్థితికి వెళ్లిపోయిన బస్సు డ్రైవర్.. 67 మంది ప్రాణాలు కాపాడిన ఓ స్టూడెంట్ సాహసం చదవండి

బస్సు డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.. బస్సు ప్రమాదానికి గురౌతోంది అంటే అందరూ ఆందోళన పడిపోతారు.. కానీ ఓ బాలుడు మెరుపులా దూకి బస్సును అదుపులోకి తెచ్చాడు. 67 మంది ప్రాణాలు కాపాడిన ఆ బాలుడి సాహసం చదవండి.

A brave boy : ట్రాఫిక్‌లో డ్రైవ్ చేస్తూ అపస్మారక స్థితికి వెళ్లిపోయిన బస్సు డ్రైవర్.. 67 మంది ప్రాణాలు కాపాడిన ఓ స్టూడెంట్ సాహసం చదవండి

A brave boy

A brave boy :  ఓ స్కూల్ బస్సులో 67 మంది స్టూడెంట్స్ ఉన్నారు. బస్సు నడుపుతున్న డ్రైవర్ అకస్మాత్తుగా అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. అప్పుడే ఓ స్టూడెంట్ ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు. బస్సులో అందరి ప్రాణాలు కాపాడాడు.

student adventure : ప్రాణాలకు తెగిస్తేనే స్కూలు పాఠాలు .. చదువుకోసం ప్రతిరోజు చిన్నారులు చేసే సాహసం చూడండి..

కార్టర్ మిడిల్ స్కూల్ కి చెందిన స్కూల్ బస్సు 67 మంది విద్యార్ధులతో బయలుదేరింది. అంతలో డ్రైవర్ ఒక్కసారిగా అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. బస్సు అదుపు తప్పి ట్రాఫిక్ లోకి దూసుకెళ్తుండగా విద్యార్ధులు ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టారు. అంతలో డిల్లాన్ రీవ్స్ అనే స్టూడెంట్ డ్రైవర్ వద్దకు పరుగున వెళ్లాడు. బ్రేక్ పెడల్ పై నొక్కి మిచిగాన్ లో రద్దీగా ఉండే డెట్రాయిట్ ఏరియా రహదారిపై బస్సుని ఆపాడు. బస్సు పూర్తిగా అదుపులోకి రాగానే డిల్లాన్ 911 కి కాల్ చేయమంటూ గట్టిగా అరిచాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. బస్సు డ్రైవర్ ను హుటాహుటీన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Kashmiri Girl Selfie video To Modi : ‘మా స్కూలు ఎంత చెత్తగా ఉందో చూడండి మోదీజీ’ : ప్రధానికి బాలిక సెల్ఫీ వీడియో

డిల్లాన్ వెంటనే స్పందించడంతో పాటు అందరినీ కాపాడటంలో అసాధారణమైన ధైర్యాన్ని చూపించాడు. ఈ ఘటన తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించిన కార్టర్ మిడిల్ స్కూల్ యాజమాన్యం డిల్లాన్ ధైర్య,సాహసాలను ఎంతగానో మెచ్చుకుంది. ఆ బాలుడి తల్లిదండ్రులు తమ బిడ్డని చూసి గర్వంగా ఉందని చెప్పారు. చిన్నవాడైన చురుగ్గా స్పందించి అంతమంది ప్రాణాలు కాపాడిన డిల్లాన్ రీవ్స్ సాహసాన్ని అభినందించి తీరాల్సిందే.