student adventure : ప్రాణాలకు తెగిస్తేనే స్కూలు పాఠాలు .. చదువుకోసం ప్రతిరోజు చిన్నారులు చేసే సాహసం చూడండి..

పిల్లలు స్కూల్ కి బస్సులో, ఆటోలో వెళ్లి గుమ్మం ముందు దిగేలోపు పేరెంట్స్ కంగారు పడిపోతారు. అక్కడ పిల్లలు స్కూల్‌కి వెళ్లి, రావడమే ఓ పెద్ద పరీక్ష. రోజూ బిడ్డల ప్రాణాలు పణంగా పెట్టి చదువులకు పంపుతున్నారు. అసలు ఏంటి అక్కడ పరిస్థితి? చదవండి.

student adventure : ప్రాణాలకు తెగిస్తేనే స్కూలు పాఠాలు .. చదువుకోసం ప్రతిరోజు చిన్నారులు చేసే సాహసం చూడండి..

student adventure

student adventure : అన్ని సౌకర్యాలు అందిస్తూ స్కూలుకి వెళ్లి చదువుకోమంటే కొందరు పిల్లలు మారాం చేస్తారు. చదువుపట్ల అశ్రద్ధ చేస్తారు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు. ఓ స్కూల్ లో చదువుకునే పిల్లలు ప్రతిరోజు సాహసం చేస్తారు. ప్రాణాలకు తెగించి మరీ వెళ్లి చదువుకుంటున్నారు.

Viral Video : ప్రాణాలకు తెగించే సాహసం.. నదిపై బైక్ నడిపిన వ్యక్తి వీడియో వైరల్

పిల్లలకు విద్య విజ్ఞానం అందిస్తుంది. మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుంది. కానీ ఆ చదువులు చాలాచోట్ల అందని కుసుమాలు అవుతున్నాయి. పాలకులు పిల్లల విద్య విషయంలో అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం అని చెబుతారు. కానీ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు సరైన సౌకర్యాలు లేక పిల్లలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బస్సు, ఆటోల్లో వెళ్లేందుకే కాదు.. కనీసం కాలి నడకన వెళ్లేందుకు కూడా సరైన మార్గాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ కి వెళ్లడానికి ప్రాణాలకు తెగిస్తున్న విద్యార్ధినుల వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. @cctvidiots అనే ట్విట్టర్ యూజర్ ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోలో ఓ విద్యార్ధిని రోప్ సాయంతో నదిని దాటుకుని వెళ్తున్న వీడియో షాక్‌కి గురి చేస్తోంది. ఏ మాత్రం తాడు తెగినా పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయ్. రోజూ అలాంటి ప్రయాణం చేస్తేనే కాని వారు చదువుకునే పరిస్థితి లేదు. ఈ ప్లేస్ ఎక్కడ? ఏంటి? అనే వివరాలు తెలియలేదు కానీ.. చూసిన వారి మనసు మాత్రం చలించిపోతోంది.

Woman walked on the river : నర్మదా నదిపై నడుచుకుంటూ వెళ్లిన వృద్ధురాలు .. దేవత అంటూ ప్రచారం.. వీడియో వైరల్

డిజిటల్ యుగంలో ఆ కాల్వపై ఇంకా బ్రిడ్జ్ నిర్మాణం లేకపోవమేంటని కొందరు.. ప్రతిరోజు ఆ చిన్నారులకు అడ్వంచర్ అని .. ఇలాంటి దారిలో పేరెంట్స్ పిల్లల్ని ఎలా చదువులకి పంపిస్తున్నారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. స్కూళ్లలో రోజూ పరీక్షలు ఉండవు. ఈ దారిలో స్కూలుకి వెళ్లే పిల్లలు మాత్రం రోజూ పరీక్షే. ఇలాంటి వీడియోలు చూస్తుంటే భయం వేస్తుంది. అదే సమయంలో ఎలాగైనా సరే చదువుకోవాలనే ఆ పిల్లల కాంక్షను చూస్తే అభినందించాలి అనిపిస్తుంది.