Noida police : స్వీపర్ కుమార్తె పెళ్లికి ఆర్ధిక సాయం అందించి గొప్ప మనసు చాటుకున్న నోయిడా పోలీసులు

కూతురి పెళ్లి చేయాలంటే ఆర్దికంగా వెసులుబాటు లేదు. ఏం చేయాలనే ఆందోళనలో ఉన్న ఓ తండ్రి పట్ల గొప్ప మనసు చాటుకున్నారు పోలీసులు. అతనికి అండగా నిలబడి అతని కూతురి పెళ్లి గ్రాండ్‌గా జరిపించారు.

Noida police : స్వీపర్ కుమార్తె పెళ్లికి ఆర్ధిక సాయం అందించి గొప్ప మనసు చాటుకున్న నోయిడా పోలీసులు

Noida police

Noida police :  కూతురి పెళ్లి కుదిరింది. కానీ వేడుక జరపడానికి సరిపడా డబ్బుల్లేవు. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్న ఆ తండ్రికి తామున్నమంటూ చేయి అందించారు నోయిడా (noida) పోలీసులు.. వారి సాయంతో అతని కూతురి పెళ్లి (wedding) వైభవంగా జరిగింది.

Wedding Card : ‘పెళ్లికి రావడం మర్చిపోండి’.. వెడ్డింగ్ ఇన్విటేషన్ చూసి షాకైన అతిథులు

నోయిడా సెక్టార్ 63లోని పోలీస్ స్టేషన్ లో స్వీపర్‌గా ( sweeper) పనిచేస్తున్నాడు 47 ఏళ్ల మహేంద్రపాల్ (mahendra pal). రోజూ పోలీస్ స్టేషన్ శుభ్రపరచడం.. తుడవడం చేస్తాడు. అలా అతనికి 6000 రూపాయలు జీతం వస్తోంది. మహేంద్రపాల్‌కి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు. ఒక కుమార్తెకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపాడు. ఇక రెండవ అమ్మాయి అషుకి (ashu) పెళ్లి కుదిరి ఏడాదైనా చేసేందుకు ఆర్ధిక పరిస్థితులు సహకరించలేదు. పెళ్లి కోసం దాచిన సొమ్మంతా తన భార్యకు క్యాన్సర్ సోకితే చికిత్సకు సరిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో చాలాకాలంగా అతను అషు పెళ్లి గురించి ఆందోళన చెందుతున్నాడు. వచ్చిన సంపాదన కుటుంబ పోషణకు సరిపోని పరిస్థితుల్లో అషు పెళ్లి కోసం సాయం చేయమని పోలీసు అధికారులైన పాల్ (pal), మాన్ (amit maan) లను కోరాడు.

Prank went wrong : ప్రాంక్ కాస్తా తుస్సుమంది.. పెళ్లికొడుకు పీకుడికి బావమరిదికి చుక్కలు కనిపించాయి..

ఇక పోలీసు అధికారులంతా తమ సిబ్బందితో సమావేశమై మహేంద్రపాల్ కుమార్తె వివాహం గురించి మాట్లాడుకున్నారు. అంతే పెళ్లి కావాల్సిన అన్ని వస్తువులు అమర్చేసారు. పెళ్లి పందిరి మొదలు.. విందు, పెళ్లి ఖర్చులతో పాటు కాపురానికి కావాల్సిన డబుల్ బెడ్, బీరువా, సోఫా సెట్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, కూలర్.. టీవీ అన్నింటినీ బహుమతిగా ఇచ్చేసారు. అంతేనా స్టేషన్ ఇన్ ఛార్జి బైక్ ను కూడా ఇవ్వడం విశేషం. ఇంకేముంది మహేంద్రపాల్ కూతురికి పెళ్లి చేయాలన్న బెంగ తీరిపోయింది. నోయిడా పోలీసులు ఇప్పుడే కాదు.. కారు ఢీకొన్న ఘటనలో ఓ బాలిక చనిపోతే పోలీస్ కమిషనర్ లక్ష్మీ సింగ్ (lakshmi singh) ఆ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్ధిక సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. సో.. నోయిడా పోలీసులకు సలాం చెప్పాల్సిందే.