Wedding Card : ‘పెళ్లికి రావడం మర్చిపోండి’.. వెడ్డింగ్ ఇన్విటేషన్ చూసి షాకైన అతిథులు

ఇంట్లో జరిగే పెళ్లి వేడుకలకి వెడ్డింగ్ కార్డ్ పంపి అతిథుల్ని ప్రేమతో పిలుస్తాం. ఓ పెళ్లివేడుకకు అతిథులకు పంపిన వెడ్డింగ్ కార్డ్ గందరగోళాన్ని క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ కార్డ్‌లో ఏముంది?

Wedding Card : ‘పెళ్లికి రావడం మర్చిపోండి’.. వెడ్డింగ్ ఇన్విటేషన్ చూసి షాకైన అతిథులు

Wedding Card

Wedding Card : ఒక్కోసారి మనం పెట్టే మెసేజ్‌లలో కానీ మెయిల్స్‌లో కానీ కొన్ని పదాలు తప్పుగా కొట్టడం వల్ల మొత్తం విషయమే తప్పు మీనింగ్‌తో వెళ్లిపోతుంది. ఒక్కోసారి అది అవతలి వారు అర్ధం చేసుకున్నా.. ఒక్కోసారి పెద్ద సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఇక వెడ్డింగ్ ఇన్విటేషన్‌లో (wedding invitation) ఎర్రర్‌లు చూసుకోకపోతే కూడా నవ్వులపాలు అవ్వడం ఖాయం.

Ghost Husband : దెయ్యం భర్త నుంచి విడాకులు కోరుతున్న భార్య.. వైరల్ అవుతున్న వింత కథ

ఓ వెడ్డింగ్ (wedding) ఇన్విటేషన్ లో ప్రింటింగ్ టైంలో చిన్న మిస్టేక్ జరిగింది. అంతే అతిథుల్ని సందిగ్ధంలో పడేసింది. పెళ్లి కార్డు మొత్తం కవితాత్మకంగా హిందీ భాషలో రాశారు. ఇక కార్డ్ చివర్లో ‘తుమ్ భూల్ జానా ఆనే కో’ అని ప్రింటయ్యింది. పెళ్లికి రావడం మర్చిపోండి.. అనే కదా దీని అర్ధం. ఇది ప్రింటింగ్ కి ఇచ్చేముందు జరిగిన తప్పిదమో.. లేక ప్రింటింగ్ స్టూడియోలో తప్పిదమో జరిగిపోయింది. ఇక అతిథుల్ని ఇన్వైట్ చేసేటపుడు కూడా పెళ్లివారు చెక్ చేసుకోకుండా అలానే పంపేసారు. ఇక ఇన్విటేషన్ అందుకున్న అతిథులు కార్డ్ చూసి వివాహానికి ఆహ్వానిస్తున్నారా? లేక వద్దంటున్నారా? అనే సందిగ్ధంలో పడిపోయారు. ఇక ఈ కార్డ్‌ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముందు? వైరల్ అయిపోయింది.

good thieves : దొంగిలించిన నగదు తిరిగిచ్చేసి పోలీసులకు షాక్ ఇచ్చిన దొంగలు.. వింత సంఘటన వైరల్

డిజిటల్ యుగంలో కార్డ్‌లు ప్రింట్ చేసి మరీ ఇన్వైట్ చేసేవారే తక్కువ అయిపోయారు. తీరా ప్రింట్ చేసి ఇన్వైట్ చేసిన వారు ఇలా ప్రింటింగ్ తప్పులతో ఆహ్వానపత్రికలు పంపితే జనాలకు ఇలాంటి డౌట్‌లు వస్తుంటాయి. ఇక ఈ కార్డ్‌ను చూసి నెటిజన్లు ఇన్విటేషన్‌లో వేడుకకు రావద్దని అవమానించారు అని కొందరు.. ఇది సరిచేయలేని తప్పిదమని కొందరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ పెళ్లికార్డు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.