Munugodu TRS Politics : కేటీఆర్ చెప్పినా తగ్గేదేలేదంటున్న మునుగోడు టీఆర్ఎస్ అసమ్మతి నేతలు..

మునుగోడు టీఆర్ఎస్ లో అసంతృప్తి రోజురోజుకి ముదురుతోంది. మునుగోడు ఉప ఎన్నికలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కేటాయించవద్దు అంటూ పలువురు అసమ్మతిరాగం అందుకున్నారు. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే సహించేది లేదంటూ తీర్మానం పెట్టి మరీ తేల్చి చెప్పారు. ఈ విషయంలో కేటీఆర్ చెప్పినా వినేదిలేదంటు తేల్చి చెప్పారు.

Tension on the candidate Munugodu By poll TRS : మునుగోడు టీఆర్ఎస్ లో అసంతృప్తి రోజురోజుకి ముదురుతోంది. మునుగోడు ఉప ఎన్నికలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కేటాయించవద్దు అంటూ పలువురు అసమ్మతిరాగం అందుకున్నారు. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే సహించేది లేదంటూ తీర్మానం పెట్టి మరీ తేల్చి చెప్పారు. అసమ్మతి నేతలను బుజ్జగించటానికి ఇప్పటికే మంత్రి జగదీశ్ రెడ్డి పలుమార్లు సమావేశం పెట్టి యత్నాలు చేశారు.కానీ అసమ్మతి నేతలు మాత్రం ఏమాత్రం శాంతించటంలేదు. ఆఖరికి స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగి చెప్పినా వినేది లేదు..కూసుకుంట్లకు టికెట్ ఇస్తే సహించేది లేదంటూ తీర్మానం పెట్టి మరీ తెగేసి చెప్పారు. కూసుకుంట్లకు బదులుగా మరే వ్యక్తికి టికెట్ ఇచ్చినా కష్టపడి గెలిపిస్తామంటూ చెప్పారు. అంతేకాదు కూసుకుంట్లకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతాం అంటూ తెగేసి చెప్పారు.

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని తీర్మానం చేసినవారిలో మెజార్టీ ప్రజాప్రతినిధులే ఉన్నారంటూ కూసుకుంట్లమీద స్థానికంగా ఎంత వ్యతిరేకత ఉందో ఊహించుకోవచ్చు. దీంతో టీఆర్ఎస్ అధిష్టానికి మునుగోడులో ఎవరిని పోటీలో నిలబెట్టాలి? అనే విషయం పెద్ద తలనొప్పిగా మారింది. అధిష్టానం అనుకున్నట్లుగానే కూసుకుంట్లను నిలబెడితే..అసలే మునుగోడులో గెలుపు సాధించి తీరాలనే పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ కు అసమ్మతి నేతలు ఝలక్ ఇస్తారనే ఆందోళన ఉంది. ఇటువంటి సమయంలో మరి కూసుకుంట్లకు టికెట్ వస్తుందా? రాదా? అనే సందిగ్థత నెలకొంది.

Also read : Munugodu TRS Politics : మునుగోడు టీఆర్ఎస్ లో ముసలం..అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి

కాగా..మునుగోడు టీఆర్ఎస్ లో ముసలం అంతకంతకు ముదురుతోంది తప్ప ఏమాత్రం తగ్గటంలేదు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వటానికి అధిష్టానం సముఖంగా ఉన్న క్రమంలో టీఆర్ఎస్ అసంతృప్త నేతలు రహస్యంగా సమావేశం అయ్యారు. దండు మల్కాపూర్ లో ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి 300 మంది నేతలు హాజరయ్యారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టి ఆయనకు టికెట్ ఇస్తే సహించేది లేదని..అవసమైతే పార్టీ నుంచి వెళ్లటానికి కూడా వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు.

ప్రభాకర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వొదని మునుగోడుకి చెందిన కొందరు టీఆర్ఎస్ అసమ్మతి నేతలు పట్టుబడుతున్నారు. ఆయనకు టిక్కెట్ ఇస్తే సహకరించేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పారు. అటు మంత్రి జగదీశ్ రెడ్డి స్వయంగా చర్చలు జరిపినా ఫలితం లేదు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినా టీఆర్ఎస్ అసంతృప్త నేతలు తగ్గడం లేదు. తాజాగా వీరంతా రహస్యంగా సమావేశం కావడం కూసుకుంట్లకు వ్యతిరేకంగా వ్యవహరించటం గులాబీ పార్టీలో కలకలం రేపుతోంది.

ఇక చౌటుప్పల్ లో టీఆర్ఎస్ జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, సర్పంచ్ లు, కార్యకర్తలు సమావేశమై కూసుకుంట్లకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. మునుగోడు టీఆర్ఎస్ టిక్కెట్ కూసుకుంట్లకు ఇస్తే టీఆర్ఎస్ ఓడిపోతుందని తేల్చి చెప్పారు. మునుగోడు ఉపఎన్నికలను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మునుగోడులో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ లో లుకలుకలు బయటపడటం పార్టీ అధిష్టానానికి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ సమస్యను సీఎం కేసీఆర్ ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి.

Also read : Munugode TRS Internal Conflicts : మునుగోడు టీఆర్ఎస్‌లో అలజడి.. అసంతృప్త నేతల రహస్య సమావేశం

కాగా..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక రాబోతోంది. ఈ బైపోల్ లో గెలిచేందుకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ సీటును గెలచుకుని తెలంగాణ రాజకీయాల్లో తమ ఆధిపత్యం రాబోతోందని చెప్పేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే.. తెలంగాణలో ఇప్పటికీ తమదే పైచేయి అని నిరూపించేందుకు అధికార టీఆర్ఎస్ యత్నిస్తోంది. అదే సమయంలో తెలంగాణలో మళ్లీ పుంజుకునేందుకు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇందుకోసం మునుగోడు ఉపఎన్నికను ఉపయోగించుకోవాలని.. ఇక్కడ తమ సర్వశక్తులు ఒడ్డాలని చూస్తోంది. మరి ఈ తీర్మార్ లో గెలుపు ఎవరిని వరిస్తుందో..మునుగోడు ప్రజల మనస్సులను గెలుచుకునే నేత ఎవరో వేచి చూడాల్సిందే. కాగా గెలుపు కోసం మూడు పార్టీలు డబ్బులను మంచినీళ్లలా ఖర్చు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఓటర్లకు భారీ నజరానాలు ఆశచూపుతున్నట్లుగా సమాచారం.

 

ట్రెండింగ్ వార్తలు