Munugode TRS Internal Conflicts : మునుగోడు టీఆర్ఎస్‌లో అలజడి.. అసంతృప్త నేతల రహస్య సమావేశం

మునుగోడు టీఆర్ఎస్ లో అసంతృప్తి రోజురోజుకి ముదురుతోంది. టీఆర్ఎస్ అసంతృప్త నేతలు రహస్యంగా సమావేశం అయ్యారు. దండు మల్కాపూర్ లో ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి 300 మంది నేతలు హాజరయ్యారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మీటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

Munugode TRS Internal Conflicts : మునుగోడు టీఆర్ఎస్‌లో అలజడి.. అసంతృప్త నేతల రహస్య సమావేశం

Munugode TRS Internal Conflicts : మునుగోడు టీఆర్ఎస్ లో అసంతృప్తి రోజురోజుకి ముదురుతోంది. టీఆర్ఎస్ అసంతృప్త నేతలు రహస్యంగా సమావేశం అయ్యారు. దండు మల్కాపూర్ లో ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి 300 మంది నేతలు హాజరయ్యారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మీటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

ప్రభాకర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వొదని మునుగోడుకి చెందిన కొందరు టీఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్నారు. ఆయనకు టిక్కెట్ ఇస్తే సహకరించేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పారు. అటు మంత్రి జగదీశ్ రెడ్డి స్వయంగా చర్చలు జరిపినా ఫలితం లేదు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినా టీఆర్ఎస్ అసంతృప్త నేతలు తగ్గడం లేదు. తాజాగా వీరంతా రహస్యంగా సమావేశం కావడం గులాబీ పార్టీలో కలకలం రేపుతోంది.

Munugodu By-Election Left Parties : మునుగోడు ఉపఎన్నికపై వామపక్షాలు కసరత్తు..టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతు?

ఇక చౌటుప్పల్ లో టీఆర్ఎస్ జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, సర్పంచ్ లు, కార్యకర్తలు సమావేశమై కూసుకుంట్లకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. మునుగోడు టీఆర్ఎస్ టిక్కెట్ కూసుకుంట్లకు ఇస్తే టీఆర్ఎస్ ఓడిపోతుందని తేల్చి చెప్పారు. మునుగోడు ఉపఎన్నికలను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మునుగోడులో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ లో లుకలుకలు బయటపడటం పార్టీ అధిష్టానానికి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ సమస్యను సీఎం కేసీఆర్ ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి.

Munugodu TRS Politics : మునుగోడు టీఆర్ఎస్ లో ముసలం..అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక రాబోతోంది. ఈ బైపోల్ లో గెలిచేందుకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ సీటును గెలచుకుని తెలంగాణ రాజకీయాల్లో తమ ఆధిపత్యం రాబోతోందని చెప్పేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే.. తెలంగాణలో ఇప్పటికీ తమదే పైచేయి అని నిరూపించేందుకు అధికార టీఆర్ఎస్ యత్నిస్తోంది. అదే సమయంలో తెలంగాణలో మళ్లీ పుంజుకునేందుకు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇందుకోసం మునుగోడు ఉపఎన్నికను ఉపయోగించుకోవాలని.. ఇక్కడ తమ సర్వశక్తులు ఒడ్డాలని చూస్తోంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw