Musical Steps in Metro Station: ఆ మెట్రో స్టేషన్ లో మెట్లు ఎక్కుతుంటే..పియానో సంగీతం వినిపిస్తుంది..

మెట్రో స్టేషన్ లో మెట్లు ఎక్కుతుంటే..పియానో సంగీతం వినిపిస్తోంది. దీంతో ప్రయాణీకులు లిప్టులు, ఎస్కలేటర్లు ఎక్కటం మానేసి మ్యూజిక్ మెట్లే ఎక్కటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Musical Stairs At Kochi Metro Station

Musical stairs at Kochi metro station : మెట్లు ఎక్కుతుంటే మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేలా సంగీతం వినిస్తే ఎలా ఉంటుంది? ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తు ఎన్ని మెట్లు అయినా ఎక్కేయాలనిపిస్తుంది కదూ..ఒక్కో మెట్టు ఎక్కుతుంటే పియానో సరాగాలు చెవులకు వీనుల విందుగా వినిపిస్తుంటే 50 మెట్లే కాదు 100 మెట్లు అయినా అవలీలగా ఎక్కేస్తాం. అటువంటి ఆహ్లాదకరమైన ఆనందకరమైన ఏర్పాటు చేసింది కేరళ.

కేరళలోని ఎర్నాకుళం ఎంజీ రోడ్‌ మెట్రోస్టేషనులో మెట్లు ఎక్కుతుంటే శ్రావ్యమైన పియానో సంగీతం వినించేలా ఏర్పాటు చేశారు. దీంతో మెట్లు ఎక్కటానికి ప్రయాణీకులు ఉత్సాహపడుతున్నారు. మెట్లు ఎక్కాలంటే లిప్టులు, ఎస్కలేటర్లు ఎక్కడున్నాయో వెతుకుతాం. కానీ ఎర్నాకుళం ఎంజీ రోడ్‌ మెట్రోస్టేషనులో మాత్రం ప్రయాణీకులు లిప్టులు, ఎస్కలేటర్లు ఎక్కటం మానేసారు.పియానో సంగీతం వినిపించే మెట్లు ఎక్కటానికే ఉత్సాహం చూపిస్తున్నారు. మెట్లే ఎక్కుతాం లిప్టులు,ఎస్కలేట్లు ఎక్కేదేలేదంటున్నారు ప్రయాణికులు.

Read more : రాయ్‌దుర్గ్ మెట్రో స్టేష‌న్‌లో ప్రత్యేకమైన మెట్ల‌ు : ఎక్కండీ..బరువు తగ్గించుకోండి

సాధారణంగా మెట్లు ఎక్కటానికి ఇష్టపడని కారణాలు ఎన్నో ఉంటాయి. అనారోగ్య కారణాలు కావచ్చు..ఆఫీసులకు గానీ..పలు పనులమీద బయటకు వెళ్లేవారు గానీ మెట్లు ఎక్కకుండా చటుక్కున లిప్టులు గానీ..ఎస్కలేటర్లు గానీ ఎక్కేస్తుంటాం. కానీ కేరళలోని కొచ్చి మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (కేఎంఆర్‌ఎల్‌) అధికారులు వినూత్నంగా ఆలోచించి మెట్రోస్టేషనులో మ్యూజికల్‌ స్టెయిర్‌కేసు ఏర్పాటు చేశారు. ప్రజలను ఆరోగ్యకరమైన అలవాట్ల దిశగా నడిపించేందుకు ఈ ఏర్పాట్లు చేశారు.

మెట్రో స్టేషన్ లో పియానో మ్యూజిక్ మెట్లు..

ఈ మెట్రో స్టేషన్ లో మెట్లపై అడుగు పెడితే చాలు..లైట్లు వెలుగుతాయి. పియానో, కీబోర్డు నుంచి వచ్చే సంగీతం వినిపిస్తుంది. దీంతో ప్రయాణీకులు ఒత్తిడిని మర్చిపోతు ఆనందంగా మెట్లు ఎక్కటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అదే విషయం ప్రయాణీకులే చెబుతున్నారు. ప్రయాణీకుల నుంచి వచ్చే చక్కటి స్పందనతో ఇతర స్టేషన్లలో కూడా ఇటువంటి ఏర్పాటు చేయటానికి ప్రయత్నిస్తున్నామని ట్రయాక్సియా మేనేజింగ్‌ డైరెక్టరు సనోజ్‌ సిమోన్‌ తెలిపారు. భలే బాగుంది కదూ..మెట్లు ఎక్కుతుంటే పియానో సంగీతం వినిపిస్తుంటే ఎన్ని మెట్లు అయినా ఎక్కేయాలనిపించే యత్నం..

Read more : Molnupiravir Capsule : కరోనాను నియంత్రించే మోల్నుపిరవిర్‌ ట్యాబ్లెట్స్‌ మార్కెట్లోకి విడుదల

 

ట్రెండింగ్ వార్తలు