Balayya Yuvasena : బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా ‘బాలయ్య యువసేన’ బ్లడ్ డొనేషన్ క్యాంప్..

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారి సహకారంతో.. ‘బాలయ్య యువసేన’ (హైదరాబాద్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో అభిమానులు బ్లడ్ డొనేట్ చేశారు..

Balayya Yuvasena : బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా ‘బాలయ్య యువసేన’ బ్లడ్ డొనేషన్ క్యాంప్..

Nadamuri Balakrishna Fans Conduct Blood Donation Camp At Ntr Trust Bhavan

Updated On : June 9, 2021 / 1:07 PM IST

Balayya Yuvasena: నటసింహా నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు.. అభిమానులకు పండుగరోజు.. బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఏటా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించే ‘బాలయ్య యువసేన’ (హైదరాబాద్) జూన్ 10న బాలయ్య 61వ పుట్టినరోజుని పురస్కరించుకుని బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేశారు.

ప్రతి ఏటా స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి, వర్థంతితో పాటు బాలయ్య పుట్టినరోజు నాడు విధిగా రక్తదాన కార్యక్రమం చేపడుతుంటారు ‘బాలయ్య యువసేన’ టీమ్. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రక్తదానం చెయ్యడమనేది గొప్ప విషయమనే చెప్పాలి. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారి సహకారంతో.. ‘బాలయ్య యువసేన’ (హైదరాబాద్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో అభిమానులు పవన్ మర్ని, శ్రీరామ్ చావా, పొట్లూరి రామకృష్ణ, పొట్లూరి రాజేష్, వినయ్ చావా, బత్తుల మణిదీప్, మధు తారక్ తదితరులు పాల్గొని బ్లడ్ డొనేట్ చేశారు.

కరోనా కష్టకాలంలోనూ అభిమాన నటుడి పిలుపు మేరకు రక్తదానం చేసిన ‘బాలయ్య యువసేన’ సభ్యులను ఎన్టీఆర్ ట్రస్ట్ టీమ్ అభినందిస్తూ వారికి సర్టిఫికెట్స్ అందచేశారు.. కోవిడ్ నేపథ్యంలో ఈ సంవత్సరం ఎటువంటి వేడుకలు నిర్వహంచకుండా అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు..