Nagababu: చిరంజీవి సపోర్ట్ జనసేనకే: నాగబాబు
తన సోదరుడు చిరంజీవి రాజకీయాల్లోకి రారని, అయితే ఆయన మద్దతు జనసేనకు ఉంటుందన్నారు ఆ పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు. పార్టీ తరఫున ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న నాగబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
- Narender Thiru
- Published On : June 3, 2022 / 04:26 PM IST
Nagababu
Nagababu: తన సోదరుడు చిరంజీవి రాజకీయాల్లోకి రారని, అయితే ఆయన మద్దతు జనసేనకు ఉంటుందన్నారు ఆ పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు. పార్టీ తరఫున ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న నాగబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చే అంశంపై స్పందించారు. ‘‘చిరంజీవి దృష్టి ప్రస్తుతం సినిమాలమీదే ఉంది. ఆయన రాజకీయాల్లోకి రారు. కానీ, ఆయన మద్దతు జనసేనకే ఉంటుంది. పొత్తుల విషయం పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా దోచుకున్నాయి.
Marriage Twist: ఇష్టంతోనే నన్ను పెళ్లి చేసుకున్నాడు: శ్రీకాంత్ భార్య లక్ష్మి
విశాఖలోని రుషికొండను తవ్వేస్తున్నారు. చారిత్రక వారసత్వాన్ని దెబ్బతీస్తున్నారు. మా పార్టీ కార్యకర్తలపై ప్రతి చిన్న అంశానికీ నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు. దీనిపై మా లీగల్ సెల్ దృష్టి పెడుతోంది. ప్రస్తుతం రాష్ట్ర భవిష్యత్ కోసం జగన్ ప్రభుత్వాన్ని దించడం తప్ప మరో మార్గం లేదు. ఉత్తరాంధ్ర ప్రజల వలసల నిరోధానికి పవన్ కల్యాణ్ వద్ద ప్రణాళిక ఉంది. మెగా ఫ్యాన్స్ ఎవరితో ఉండాలన్నది వారి వ్యక్తిగత విషయం. వారు జనసేనవైపే ఉంటారునుకుంటున్నా’’ అంటూ నాగబాబు చెప్పారు.
