Balakrishna : ‘అఖండ’ ఆన్ ది వే..

‘అఖండ’ మూవీ నుండి బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 9వ తేది సాయంత్రం 4:36 గంటలకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చెయ్యనున్నారు..

Balakrishna : ‘అఖండ’ ఆన్ ది వే..

Nandamuri Balakrishna Birthday Poster From Akhanda Movie

Updated On : June 8, 2021 / 5:21 PM IST

Balakrishna: నటసింహ నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు బర్త్‌డే ట్రీట్ ఇవ్వబోతున్నారు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బాలయ్య, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ ఫిలిం.. ‘అఖండ’..

Akhanda Title Roar : యూట్యూబ్‌లో ‘అఖండ’ అరాచకం.. TFI లో ఫాస్టెస్ట్ 50 మిలియ‌న్స్ వ్యూస్ టీజ‌ర్‌‌గా బాలయ్య రికార్డ్..

ప్రగ్యా జైస్వాల్, పూర్ణ, శ్రీకాంత్, సునీల్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఉగాదికి విడుదల చేసిన ‘అఖండ’ ఫస్ట్ రోర్ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలయ్యను అఘోరా గెటప్‌లో చూసి షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌కి గురయ్యారంతా..

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తన్న ‘అఖండ’ మూవీ నుండి బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 9వ తేది సాయంత్రం 4:36 గంటలకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చెయ్యనున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నారు.