Balakrishna Fans : యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా బాలయ్య పుట్టిన రోజు వేడుకలు..

నందమూరి బాలకృష్ణ 61వ జన్మదిన వేడుకలను యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు..

Balakrishna Fans : యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా బాలయ్య పుట్టిన రోజు వేడుకలు..

Nandamuri Balakrishna Fans Organized A Special Covid 19 Vaccination Drive

Updated On : June 10, 2021 / 7:29 PM IST

Balakrishna Fans: నందమూరి బాలకృష్ణ 61వ జన్మదిన వేడుకలను యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హీరోగానే కాక, ఎమ్మెల్యేగానూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోన్న బాలయ్య నుంచి స్ఫూర్తి పొంది అభిమానులు కూడా అదే తరహాలో ఆయన బర్త్‌డే వేడుకలను నిర్వహించారు.

ఇందుకోసం హైదరాబాద్ కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్ ఆవరణలో 500మంది నిరుపేదలకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్‌ అందించారు. బాలయ్య వీరాభిమాని అయిన యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్ సర్కిల్ ఈ కార్యక్రమాన్ని మంచి సేవాతత్పరతతో నిర్వహించి శభాష్ అనిపించుకుంది. బాలకృష్ణ జన్మదిన వేడుకలతో పాటు ఉచిత వ్యాక్సిన్ పంపకం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, నార్నే శ్రీనివాసరావు పాల్గొన్నారు.

వీరితో పాటు బాలకృష్ణ తర్వాతి చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీస్ అధినేత యలమంచిలి రవి శంకర్, 14 రీల్స్ ప్లస్ అధినేత రామ్ ఆచంట హాజరయ్యారు. యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్ సర్కిల్‌తో పాటు బాలయ్య అభిమానులు భారీగా పాల్గొన్న ఈ పుట్టిన రోజు వేడుకలు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.