Nani Ante Sundaraniki First Single To Be Out On This Date
Nani: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాని లాస్ట్ మూవీ ‘శ్యామ్ సంగ రాయ్’ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో, ఈసారి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీతో మనమందుకు రాబోతున్నాడు ఈ హీరో.
Ante Sundaraniki: సినిమాకో వేరియేషన్.. నా టేస్టే వేరంటున్న నాని!
ఇక నాని నటిస్తున్న అంటే సుందరానికి చిత్రం నుండి ఉగాది సందర్భంగా ఓ కీలక అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘పంచె కట్టు’ను ఏప్రిల్ 6న సాయంత్రం 6.03 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా కనిపిస్తున్నాడు. ఇక నాని సరసన మలయాళ భామ నజ్రియా నటిస్తోంది. తెలుగులో ఆమెకు ఇది తొలి సినిమా కావడంతో ప్రేక్షకులు ఆమె ఎంట్రీపై ఆసక్తిగా ఉన్నారు.
Ante Sundaraniki: అంటే సుందరానికి నుండి ప్రేయర్ ఆఫ్ లీలా.. ఇంట్రో అదిరింది!
కాగా ఈ సినిమాలో ఆమె లీలా అనే క్రిస్టియన్ అమ్మాయి పాత్రలో నటిస్తోంది. దీంతో ఈ సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయా అని ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి నాని ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.