Nani Mesmerizes With Panchakattu Song From Ante Sundaraniki
Nani: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘‘అంటే సుందరానికీ!’’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తుండగా ఇందులో నాని, నజ్రియా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మలయాళ బ్యూటీ నజ్రియాకు ఇది తొలి తెలుగు సినిమా కావడం గమనార్హం. ఇక ఈ సినిమాలో నాని, నజ్రియా మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Ante Sundaraniki: అంటే సుందరానికి నుండి ప్రేయర్ ఆఫ్ లీలా.. ఇంట్రో అదిరింది!
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. కాగా తాజాగా ఈ సినిమాలోని ‘పంచకట్టు’ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటను లెజెండరీ కర్ణాటిక్ సింగర్ పద్మశ్రీ అరుణ సాయిరామ్ ఆలపించడం విశేషం. అయితే ఈ పాట చాలా కొత్తగా ఉండటమే కాకుండా విన్నకొద్దీ మళ్లీ వినాలనిపిస్తుంది. ఓ క్లాసికల్ సింగర్‌తో ఇలాంటి పాటను పాడించడంతో ఈ పాటకు సరికొత్త అందం వచ్చిందని చెప్పాలి. ఇక ఈ పాటకు వివేక్ సాగర్ అందించిన సంగీతం, హసిత్ గోలి లిరిక్స్ సూపర్బ్‌గా కుదిరాయి.
Ante Sundaraniki: సినిమాకో వేరియేషన్.. నా టేస్టే వేరంటున్న నాని!
అటు నాని పంచకట్టులో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అమెరికాలో పంచకట్టుతో నాని ఎలాంటి పాట్లు పడతాడు అనేది మనకు ఈ పాటలో చూపించబోతున్నారు. ఇక ఈ పాట రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం. ఏదేమైనా ఆసక్తికరమైన టైటిల్‌తో వస్తున్న నాని, అంతకంటే ఆసక్తికరమైన పాటతో రావడం ఇప్పుడు ప్రేక్షకులను ఈ సినిమా కోసం ఎదురుచూసేలా చేస్తుంది. ఇక ఈ సినిమాతో నాని మరోసారి తన సత్తా చాటడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న అంటే సుందరానికీ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 10న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.