NASA : ముంచుకొస్తున్న పెను ఉపద్రవం..నాసా వార్నింగ్!

మొత్తం ఐదారు సౌర తుపాన్ లు భూమిని తాకడం జరిగిందని, ప్రస్తుతం దూసుకొస్తున్న సౌర తుపాన్ లు హై అలర్ట్ లో ఉన్నాయన్నారు.

NASA : ముంచుకొస్తున్న పెను ఉపద్రవం..నాసా వార్నింగ్!

Nasa

Updated On : December 22, 2021 / 7:11 PM IST

Solar System Exploration : మరో ఉపద్రవం ముంచుకొస్తోందని నాసా హెచ్చరికలు జారీ చేసింది. అది సూర్యుడి నుంచి భూమివైపుగా దూసుకొస్తోందని, దీనివల్ల సౌర తుపాన్స్ ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రెండు పెద్ద సౌర తుపాన్ లు సూర్యుడి నుంచి విడుదలయ్యే ఛాన్స్ ఉందని అంతరిక్ష వాతావరణ భౌతిక శాస్త్రవేత్త డా.తమిత స్కోవ్ వెల్లడించారు. సూర్యుడి నుంచి వెలువడే ఈ సౌర తుపాన్ ల తీవ్రత ఇంకా నిర్ధారించలేదని, గతంలో జీ2, జీ3 మాగ్నెటిక్ సౌర తుపాన్ లు వచ్చాయన్నారు. ఈ సంవత్సరంలో మొత్తం ఐదారు సౌర తుపాన్ లు భూమిని తాకడం జరిగిందని, ప్రస్తుతం దూసుకొస్తున్న సౌర తుపాన్ లు హై అలర్ట్ లో ఉన్నాయన్నారు.

Read More : Telangana : ప్రభుత్వంపై పగబట్టిన బీజేపీ, మంత్రులనే అవమానపరుస్తారా ?

సౌర తుపాన్ భూమిని తాకితే ఏమి జరుగుతుంది :-
సౌర తుపాన్ లు భూమిని తాకడం వల్ల పలు రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ గ్రిడ్లపై ఎఫెక్ట్ పడుతుందని దీనికారణంగా విద్యుత్ హెచ్చుతగ్గులవుతుందని అంటున్నారు. న్యూయార్క్ లాంటి ప్రాంతాల్లో అరోరా బోరియలిస్ కాంతులను చూసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. రేడియో కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్ విఘాతం కలుగుతాయని వెల్లడిస్తున్నారు. జీపీఎస్ ఆధారిత వ్యవస్థలు కప్పకూలిపోతాయన్నారు.

Read More : Bill Gates: మూడు నెలల్లో ప్రమాదంలో ప్రపంచం.. బిల్‌గేట్స్ సంచలనం!

ఎందుకు ఏర్పడుతాయి :-
అయస్కాంత క్షేత్రంలోని పెరగడం, తగ్గడం వల్ల ఇవి ఏర్పడుతాయి. సూర్యుడి అయస్కాంత ధృవాలు మారుతూ ఉంటాయి. దీనినే సోలార్ మాగ్జిమమ్ గా పిలుస్తారు. ప్రతి 11 సంవత్సరాలకొకసారి సూర్యుడి మాగ్నెటిక్ సైకిల్ ఓవర్ డ్రైవ్ అవుతూ ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.