Punjab Police : పంజాబ్ పోలీసుకు సెల్యూట్ కొడుతున్న నెటిజన్లు.. ఇంతకీ ఆయనేం చేశారంటే?

పంజాబ్ పోలీస్ మానవత్వం చాటుకుని మనసు దోచుకున్నారు. నిత్యం విధుల్లో బిజీగా ఉన్నా ఖాళీ సమయం దొరికితే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన సేవా నిరతికి నెటిజన్లు సెల్యూట్ కొడుతున్నారు.

Punjab Police :  పోలీసులు కఠినంగా ఉంటారని.. ఎప్పుడూ తమ వృత్తికి సంబంధించిన అంశాలు తప్ప వేరేది పట్టదని అనుకుంటారు. ఇప్పుడు మానవత్వం చాటుకున్న ఓ పోలీస్ గురించి చదవండి.

Police Stories : మళ్ళీ పోలీస్ స్టోరీల వైపుకు మళ్ళిన సినిమాలు.. పోలీస్ కథలే కావాలంటున్న హీరోలు..

పోలీసు వృత్తి సవాళ్లతో కూడుకున్నది. నిత్యం కేసులు, కోర్టులు అంటూ విధుల్లో బిజీగా ఉండే పోలీసులు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అలా అందరి మనసు దోచుకున్న పంజాబ్ పోలీస్ ఆఫీసర్ రాగ్‌పికర్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభయ్ గిరి అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ ద్వారా షేరైన వీడియోలో రాగ్‌పికర్‌ రోడ్డుపై వెళ్తున్న ఓ బాలుడికి వాటర్ బాటిల్ అందించారు.

కాళ్లకు చెప్పులు కూడా లేని అతనికి స్వయంగా తొడిగించారు. అలాగే అతనికి కొత్తబట్టలు కూడా ఇవ్వడంతో ఆ బాలుడి కళ్లు ఆనందంతో మెరిసిపోయాయి. వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్‌కి చేతులు జోడించాడు. పోలీసులకు కుటుంబంతో సమయం గడపడానికే సమయం దొరకదు. ఇక సేవా కార్యక్రమాలకు.. అనుకునే వారికి రాగ్‌పికర్ ఆదర్శంగా నిలిచారు. వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి నెటిజన్లు ఆయనపై అభినందనల జల్లు కురిపిస్తున్నారు.

dancing cop : హీరోల్ని మించి స్టెప్పులు ఇరగదీస్తున్న ముంబయి పోలీస్ వీడియో వైరల్

” సెల్యూట్ సార్ మీ లాంటి నిజాయితీ గల పోలీసులకు మాత్రమే..” అని కొందరు. “ప్రతి ఒక్కరూ మీలా ఉంటే దేశంలో 90% వ్యాధులు తగ్గిపోతాయని”.. మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. రాగ్‌పికర్ సేవాభావానికి అందరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు